Begin typing your search above and press return to search.
సీపీ సజ్జనార్ పై ఫిర్యాదు చేసిన స్వచ్ఛంద సంస్థ !
By: Tupaki Desk | 9 Dec 2019 8:38 AM GMTవెటర్నరీ డాక్టర్ దిశ పై నలుగురు మానవ మృగాళ్లు దాడి చేసి - అఘాయిత్యానికి పాల్పడి - హత్య చేసిన ఘటన ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ ఘటన పై దేశ వ్యాప్తంగా నిరసనలు వెలువడ్డాయి. అమ్మాయిలపై ఇలాంటి దారుణాలు జరుగుతుంటే ప్రభుత్వాలు - పోలీసులు ఏంచేస్తున్నారు అంటూ ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి తమ నిరసన ని తెలిపారు. ఇక పోలీసులు కూడా ఈ కేసుపై ప్రత్యేక దృష్ఠి పెట్టి నిందుతులని పట్టుకొని విచారణ చేస్తుండగా ..సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో ఆ నలుగురు నింధితులు పోలీసులపైకి రాళ్లతో దాడి చేసి - పోలీసుల తుపాకులు లాక్కొని ఫైర్ చేయడంతో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో మృతి చెందారు.
ఈ ఎన్ కౌంటర్ ని కొంతమంది సమర్దించగా ..మరికొంతమంది వ్యతిరేకించారు. ఇక తాజాగా ఈ ఎన్ కౌంటర్ పై హైదరాబాద్ నగరానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తోపాటు నలుగురు పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని ‘నేను సైతం’ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు డి ప్రవీణ్ కుమార్ ఉప్పల్ పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో కోరారు. దిశ కేసులో నలుగురు నిందితులను పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపిన ఘటనపై సజ్జనార్ తోపాటు మరో నలుగురు పోలీసు అధికారులపై హత్య కేసు నమోదు చేయాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.కాగా ప్రవీణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై రాచకొండ పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేయలేదు.