Begin typing your search above and press return to search.
ఏపీ మంత్రి అంబటిపై `సంబరాల` కేసు.. పోలీసులు ఏం చేశారంటే
By: Tupaki Desk | 18 Jan 2023 1:37 PM GMTఏపీ మంత్రి, తరచుగా వార్తల్లో ఉండే అంబటి రాంబాబుపై పోలీసులు కేసు పెట్టారు. అది కూడా హైకోర్టు ఆదేశాల మేరకు నమోదు చేయడం గమనార్హం. ఇంతకీ ఆయనపై కేసు ఎందుకు పెట్టారంటే.. ఇటీవల ముగిసిన సంక్రాంతిని పురస్కరించుకుని గత ఏడాది డిసెంబరులో `లక్కీ డ్రా` నిర్వహించేందుకు మంత్రి తన సొంత నియోజకవర్గంలో ఏర్పాట్లు చేశారు.
ఒక్కొక్క టికెట్‌ను రూ.100 చొప్పున విక్రయించేందుకు తన అనుచరులను రంగంలోకి దింపారు. `వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంక్రాంతి సంబరాలు` పేరుతో ముద్రించిన ఈ టికెట్లు బలవంతంగా అంటగట్టారనే ఫిర్యాదులు ఉన్నాయి.
ఈనేపథ్యంలో మంత్రి అంబటి లాటరీ వసూళ్లపై జనసేన నేతలు కొందరు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ నిషేధ చట్టం కింద కేసు నమోదైంది. వాస్తవానికి ఈ లాటరీ వ్యవహారంపై గత ఏడాదే.. జనసేన నేతలు కొందరు ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోలేదు.అంతేకాదు.. ఎదురు కేసులు పెడతామని కూడా బెదిరింపులకు గురిచేసిన ఆరోపణలు ఉన్నాయి.
దీంతో గుంటూరు కోర్టులో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించి.. లాటరీ విషయంపై పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై విచారణ జరిపిన కోర్టు.. మంత్రి అంబటిపై తక్షణమే కేసు నమోదు చేసి విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో పోలీసులు ఆయనపై ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. అయితే.. పోలీసులు పెట్టిన సెక్షన్‌లపైనా నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్ బెయిల్ పొందే కేసులని.. పేర్కొంటున్నారు. మొత్తానికి వైసీపీ మంత్రిపై కేసు నమోదు కావడం.. ఈ మూడున్నరేళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.