Begin typing your search above and press return to search.

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పై కేసు నమోదు

By:  Tupaki Desk   |   4 Nov 2022 12:30 PM GMT
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పై కేసు నమోదు
X
టాలీవుడ్ ఫేమస్ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. దేవీ శ్రీప్రసాద్ పై ప్రముఖ వివాదాస్పద సినీ నటి కరాటే కళ్యాణి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ ఐటెం సాంగ్ విషయమై ఆమె మండిపడుతూ పోలీసులకు కంప్లైంట్ చేసింది.
కరాటే కల్యాణి చేసిన ఫిర్యాదుపై సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పై కేసు నమోదు చేసిన సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు విచారణ జరుపుతున్నారు.

తాజాగా సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ తన మొట్టమొదటి ఆల్బమ్ సాంగ్ “ఓ పరి”తో వచ్చారు. ఈ పాటకు మిశ్రమ స్పందన లభించింది. టి-సిరీస్ ఛానెల్‌లో విడుదలైన హిందీ వెర్షన్ కోసం పాడిన పాట 20+ మిలియన్ల వ్యూస్ సంపాదించింది. ‘ఓ పారి’ అనే ప్రేవేట్ ఆల్బమ్ లో "హరే రామ - హరే కృష్ణ" మంత్రంపై అశ్లీల నృత్యాలు చేశారని హిందు సంఘాలు , కరాటే కల్యాణి ఫిర్యాదు చేశారు.

హిందువుల మనోభావాలను దేవిశ్రీ ప్రసాద్ దెబ్బతీశాడని కరాటే కల్యాణి ఫిర్యాదులో పెర్కొంది. లీగల్ ఒపీనియన్ తీసుకొని తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అన్నట్టే ఓపినియన్ తీసుకొని తాజాగా సీసీస్ సైబర్ క్రైమ్ ఏసీపీ కెవిఎం ప్రసాద్ కేసు నమోదు చేశారు.

నటి కరాటే కళ్యాణి ఇప్పుడు ఈ పాటలోని సాహిత్యం హిందూ మతాన్ని , హిందువులను అవమానించేలా ఉందని విమర్శిస్తూ హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కరాటే కళ్యాణ్ ఇటీవల విడుదల చేసిన ‘ఓ పారీ’ సాంగ్‌లో పవిత్ర హిందూ శ్లోకం ‘హరే రామ హరే కృష్ణ’ని ఉపయోగించడంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని.. తోటి హిందూ సంస్థలను కించపరిచేలా ఇది ఉందని పేర్కొంది.

-వివాదం ఇదీ

హిందీలో దేవీశ్రీ ప్రసాద్ తాజాగా ‘ఓ పోరి’ అనే పాప్ ఆల్బమ్ ను పాడి విడుదల చేశారు. విదేశీ మోడల్స్ తో కలిసి దేవీ శ్రీ ఈ పాటలో తెగ హంగామా చేస్తూ ఆల్బమ్ రూపొందించారు. అమెరికా, ఆస్ట్రేలియా, స్పెయిన్ లాంటి దేశాల్లో చిత్రీకరించిన ఈ పాటను భారీ బడ్జెట్ తో తీశారు. అయితే ఈ పాటను విడుదల చేశాక అందులో వాడిన ‘హరే రామ హరే కృష్ణ’ మంత్రం వివాదాస్పదమైంది. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కరాటే కళ్యాణి సహా పలువురు ఫిర్యాదు చేశారు. అశ్లీల దుస్తులు, నృత్యాలు చేస్తూ ఈ పాటను తీశారని వారు ఆరోపిస్తున్నారు. నిలిపివేయాలని కోరుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.