Begin typing your search above and press return to search.
రేవంత్ రెడ్డిని జగన్ కు అప్పగిస్తారట!
By: Tupaki Desk | 14 March 2020 11:30 AM GMTప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా, కేసీఆర్ తో పోటీ పడుతున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. టీడీపీలో ఉన్నా.. కాంగ్రెస్ లో ఉన్నా ఎప్పుడు కేసీఆర్ - కేటీఆర్ లక్ష్యంగా రేవంత్ రెడ్డి వ్యవహారం నడిచేది. ఈ వైఖరే ప్రస్తుతం ఆయనను జైలు పాల్జేసింది. కేసీఆర్ - కేటీఆర్ కు ఎప్పుడు పక్కలో బల్లెంలో రేవంత్ రెడ్డి ఉంటున్నాడు. ఇటీవల కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమంగా నిర్మించుకున్నాడని, దాన్ని బహిర్గతం చేసేందుకు డ్రోన్ వినియోగించి మీడియాకు చూపించారు. అయితే ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సింది పోయి.. ప్రైవేటు నిర్మాణాలపై డ్రోన్ తో చిత్రీకరించడం అనే చిన్న విషయమై కేసు నమోదు చేసి జైలులో పెట్టింది. రేవంత్ చేసిన ఆరోపణలను పక్క దోవ పట్టించింది.
అయితే రేవంత్ రెడ్డిని ఎంత తొక్కినా పైకి ఎగురుతుండని టీఆర్ ఎస్ భావించింది. గతంలోనే రేవంత్ రెడ్డిని ఓటుకు నోట్లు కేసు వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా పట్టించారు. ఆయన జైలుకె వెళ్లి వచ్చి దర్జాగా కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇప్పుడు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎదిగాడు. అయితే కొడంగల్ లో కుట్రపూరితంగా రేవంత్ రెడ్డిని ఓడించిన టీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికలను అడ్డుకోలేకపోయింది. రేవంత్ రెడ్డి అనూహ్యంగా మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలుపొందాడు. రేవంత్ కథ ముగిసిందని అనుకుంటుండగానే ఎంపీగా గెలవడంతో టీఆర్ఎస్ పార్టీ షాకైంది. కొన్నాళ్లు శాంతంగానే ఉన్న రేవంత్ రెడ్డి ఇటీవల పట్నం గోస అంటూ తన లోక్ సభ నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తూ ప్రభుత్వ తీరును ఎండగడుతూ.. ముఖ్యంగా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంపై నిలదీశాడు. దానికి స్పందన రావడం తో ప్రభుత్వం వెంటనే రేవంత్ రెడ్డి అక్రమాలంటూ ఓ కేసును వెలుగులోకి తెచ్చింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టడం తో రేవంత్ రెడ్డి ప్రతీకారంగా కేటీఆర్ అక్రమాలంటూ జన్వాడలో రచ్చ చేశాడు. ఆ వ్యవహారంలో జరిగిన వాటిలో చిన్న అంశాన్ని తీసుకుని ఇప్పుడు జైలుకు పంపించింది. అయితే రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అప్పగిస్తామని ఈ క్రమంలో ఓ టీఆర్ఎస్ నాయకుడు పేర్కొన్నాడు.
రేవంత్ రెడ్డి కుటుంబం అవినీతి ఆంధ్రప్రదేశ్ లోనూ ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కుమార్తె నిమిషా రెడ్డి వ్యాపారాలు అక్రమమని ఆరోపించారు. 2018లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో కామెరూన్ ఫుడ్స్ పేరుతో రేవంత్ రెడ్డి కుమార్తె వ్యాపారాలు ప్రారంభించిందని తెలిపారు. కోట్ల రూపాయల వ్యవహారానికి సంబంధించిన ఆ వ్యాపారం అక్రమమా.. సక్రమమా అన్నది నిగ్గు తేల్చాలని ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వాన్ని కోరాడు. ఇదే విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించారు. ఇదొక్కటే కాదు.. రేవంత్ అక్రమాలన్నీ బయటకు తీస్తానని హెచ్చరించారు.