Begin typing your search above and press return to search.
అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు ..ఎందుకంటే
By: Tupaki Desk | 10 Sep 2021 7:21 AM GMTఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపధ్యంలో అప్పుడే రాజకీయం అక్కడ వేడెక్కుతుంది. అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల ప్రచారం అప్పుడే ప్రారంభించేశారు. దాదాపు ఏడాది ముందే ఒవైసీ ప్రచారం ప్రారంభించడంపై చర్చ సాగుతోంది. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్‌వాద్ పార్టీలు లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు అసదుద్దీన్ ఒవైసీ. ఎస్పీ, బీఎస్పీల కారణంగానే నరేంద్ర మోదీ రెండు సార్లు ప్రధానమంత్రి అయ్యారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అఖిలేష్ యాదవ్, మాయావతిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసదుద్దీన్ కారణంగా తమ పార్టీ ఓట్లు చీలిపోతున్నాయని చెబుతూ ఓట్ స్పాయిలర్‌గా అభివర్ణించడంపై ఒవైసీ మండిపడ్డారు. అఖిలేష్ యాదవ్, మాయావతి కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. యూపీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయడం వల్ల బీజేపీ అభ్యర్ధుల ఓట్లు పోతున్నాయనే విమర్శలపై సమాధానమిచ్చారు. తమ పార్టీ ఓట్లు చీల్చితే, గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులు ఎలా గెలిచారని ప్రశ్నిచారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ముస్లిం ఓట్లతో బీజేపీ గెలవలేదని గుర్తు చేశారు. ముస్లిం ప్రయోజనాల్ని కాపాడేందుకే దేశవ్యాప్తంగా ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తోందని చెప్పారు. 2019 ఎన్నికల్లో హైదరాబాద్, మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బీహార్ లోని కిషన్ గంజ్ లోని మూడు లోక్ సభ స్థానాల్లో విజయం సాధించిందన్నారు. మోదీ,అమిత్ షాలు హైదరాబాద్ లో పలు పర్యటనలు చేసినప్పటికీ, బీజేపీ ఓడించగలిగామన్నారు.
ఇదిలా ఉంటే... అసదుద్దీన్ ఒవైసీపై యూపీలోని బారాబంకి పోలీసులు కేసు నమోదు చేశారు. బారాబంకీ జిల్లాలో అసదుద్దీన్ రెచ్చగొట్టే ప్రసంగం చేసి మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. బారాబంకీలో 100 సంవత్సరాల పురాతన మసీదును కూల్చివేశారని, ఈ వ్యవహారంలో పాలకులను ఎంపీ నిందించారు. ఈ సంఘటనకు వ్యతిరేకంగా మాట్లాడని ప్రతిపక్ష పార్టీలను అసద్ విమర్శించారు. మతసామరస్యానికి విఘాతం వాటిల్లేలా రెచ్చగొట్టేలా ప్రసంగించడంతోపాటు మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లపై అసదుద్దీన్ ఒవైసీ అసభ్య పదజాలం ఉపయోగించారని పోలీసులు ఆరోపించారు. కరోనా ప్రోటోకాల్ ను ఉల్లంఘించినందుకు ఎపిడెమిక్ వ్యాధుల చట్టంలోని సంబంధిత సెక్షన్‌లు, సమావేశానికి సంబంధించిన షరతులతో పాటు భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 153ఎ, 188, 169, 170 కింద గురువారం రాత్రి ఒవైసీని బుక్ చేసినట్లు బారాబంకీ ఎస్పీ యమునా ప్రసాద్ తెలిపారు. బారాబంకి బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఒవైసీ రామ్ సనేహి ఘాట్ లోని మసీదు గురించి ప్రస్థావించారు.