Begin typing your search above and press return to search.

ఉరిమురిమి అశోక్ బాబు మీద పడ్డారు...?

By:  Tupaki Desk   |   25 Jan 2022 1:35 PM GMT
ఉరిమురిమి అశోక్ బాబు మీద పడ్డారు...?
X
అటు చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు బస్తీ మే సవాల్ అంటున్నారు. ఇటు చూస్తే ప్రభుత్వం వారిని చర్చలకు పిలిచినా బే ఖాత‌ర్ అనేస్తున్నారు. దీంతో సర్కార్ పెద్దలకు ఈ ఇష్యూని ఎలా సెటిల్ చేయాలో తెలియక తల బొప్పి కడుతోంది. మంత్రుల కమిటీని ఏర్పాటు చేసినా కూడా చర్చలకు ఉద్యోగులు రావడంలేదు. అయితే సీఎం జరిగిన పీయార్సీ చర్చల తరువాత నవ్వుకుంటూ వెళ్ళిన ఉద్యోగులను మార్చేసి తమ ట్రాప్ లోకి లాగేసింది టీడీపీ అని వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి.

ఇక ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా ఉంటూ సమైక్యాంధ్రా ఉద్యమంలో ఆరడుగుల బుల్లెట్ గా అవతరించి ఆ తరువాత పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారిన టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు మీద వైసీపీ పెద్దలు పూర్తి డౌట్ పడుతున్నట్లుగా కనిపిస్తోంది. దాంతో అటు ఉద్యోగుల ఆందోళన జరుగుతున్న కీలక వేళ మాజీ నేత, టీడీపీ నాయకుడు అయిన అశోక్ బాబు మీద పాత కేసుని తిరగతోడడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

అశోక్ బాబు మీద తాజాగా సెక్షన్ 477ఆ,465,420 కింద సీఐడీ కేసు నమోదు చేసింది. ఇంతకీ ఈ కేసు ఏంటి అంటే అశోక్ బాబు తాను బీకాం చదవకపోయినా చదివినట్లుగా తప్పుడు సమాచారం ఇచ్చారని కేసు ఒకటి పాతలో నమోదు అయి ఉంది. ఆయన అసిస్టెంట్ కమర్షియల్ ట్సాక్స్ ఆఫీసర్ గా పనిచేసే సమయంలో కొంతమంది అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి రికార్డులను ట్యాంపరింగ్ చేసినట్లు అశోక్ బాబుపై ఆరోపణలు ఉన్నాయి

దాని మీద మెహర్ కుమార్ అనే ఉద్యోగి గతంలో లోకాయుక్తలో ఫిర్యాదు కూడా చేశరు. దీంతో దీని మీద స్పెషల్ చీఫ్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ నుంచి లోకాయుక్త రిపోర్ట్ తెప్పించుకుని పరిశీలించిన మీదట గతేడాది ఆగస్టులో అశోక్ బాబు కేసును సీఐడీకి అప్పగించాలంటూ లోకాయుక్త ఆదేశాలు ఇచ్చింది. అంటే ఇప్పటికి ఆరు నెలల క్రితం అన్న మాట. ఇక దీని మీద జాయింట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ గీతామాధురి సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఇలా అటు లోకాయుక్త తో పాటు ఇటు శాఖాపరంగా అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అశోక్ బాబు మీద సీఐడీ కేసు పెట్టింది. అంతే కాదు ఎమ్మెల్సీగా పోటీ చేసిన సమయంలో కూడా తాను బీకాం చదివినట్లుగా అశోక్ బాబు తన ఎన్నికల అఫిడవిట్ లో సైతం పేర్కొన్నారు అని అభియోగాలు ఉన్నాయి. మొత్తానికి సీఐడీ ఈ కీలకమైన టైమ్ చూసి మరీ అశోక్ బాబు మీద వివిధ సెక్షన్ల పేరుతో కేసులను నమోదు చేయడం విశేషంగానే చూడాలి

ఒక విధంగా ఇది తప్పు ఎవరు చేసినా ఉపేక్షించమని ప్రభుత్వం ఆందోళనకారుల‌కు కూడా ఇండైరెక్ట్ గా హెచ్చరికలు పంపించినట్లే అంటున్నారు. మొత్తానికి అశోక్ బాబు ని టార్గెట్ చేయడం పట్ల సర్వత్రా చర్చ అవుతోంది. చూడాలి ఇది ఎటు వైపునకు దారితీస్తుందో.