Begin typing your search above and press return to search.
చంద్రబాబుపై కేసు నమోదు ?
By: Tupaki Desk | 10 May 2022 10:30 AM GMTఅమరావతి ల్యాండ్ పూలింగ్ కు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు పై కేసు నమోదు అయింది. ఎ1గా చంద్రబాబు ఉన్నారు.ఎ2గా మాజీ మంత్రి నారాయణతో సహా 14 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ ఈ చర్య తీసుకుంది.
ఇప్పటికే పదో తరగతి పరీక్ష పేపర్ లీకుకు సంబంధించి నమోదయిన అభియోగాల నేపథ్యంలో హైద్రాబాద్ లో అరెస్టు అయిన నారాయణపై మరో కేసు నమోదు అయింది.
ఇదే సమయంలో రాజధాని ల్యాండ్ పూలింగ్, ఓఆర్ఆర్ అలైన్ మెంట్ మార్పునకు సంబంధించి నిందితులుగా ఉన్న చంద్రబాబుతో సహా నారాయణ పేరు మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి.
మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో చంద్రబాబుతో సహా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. సీఐడీ అడిషనల్ ఎస్పీ జయరామ రాజును దర్యాప్తు అధికారిగా నియమించారు.
ఇక ఈ కేసులకు సంబంధించి నారాయణ ఏం స్పందించనున్నారో అన్నది ఆసక్తిదాయకం ఉంది. ఆ రోజు సీఆర్డీఏ పేరిట కొన్ని నిర్మాణాలు సాగించిన క్రమంలో అవకతవకలు జరిగాయి అని ఎప్పటి నుంచో వైసీపీ ఆరోపిస్తోంది.
తనవాళ్లకు లబ్ధి చేకూరేలా ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కూడా మార్చారని వైసీపీ ఆరోపిస్తోంది.ఈ రెండు ప్రధాన ఆరోపణల నేపథ్యంలోచంద్రబాబు పై కేసు నమోదవ్వడం, మరోవైపు ఆయన అరెస్టు ఉంటుందా అన్న కలవరం రేగడం విభిన్న వాతావరణంలో రాజకీయ ప్రచ్ఛన్న యుద్ధం ఒకటి ఆరంభం అయింది.