Begin typing your search above and press return to search.

మాజీ సీఎం కమల్ నాథ్ పై కేసు నమోదు .. ఏమైందంటే ?

By:  Tupaki Desk   |   24 May 2021 6:30 AM GMT
మాజీ సీఎం కమల్ నాథ్ పై కేసు నమోదు .. ఏమైందంటే ?
X
కరోనా వైరస్ మహమ్మారి పై రాజకీయ వివాదానికి తెరలేపిన కాంగ్రెస్‌ టూల్‌ కిట్‌ వ్యవహారంపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య చెలరేగిన మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న, మొన్నటి వరకు వరకు ట్విట్టర్ వేదికగా టూల్‌కిట్‌ విషయంలో పరస్పరం ఆరోపణలు చేసుకున్న పార్టీలు ఇప్పుడు కరోనా మ్యూటెంట్‌ పేరిట దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ట్విట్టర్‌ లేబుల్‌ తో ఈ గొడవ సమసిపోతుంది అనుకుంటున్న సమయంలో టూల్‌ కిట్‌ వివాదం మళ్లీ మొదటికొచ్చింది. మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ నేత కమల్‌ నాథ్‌ ఈ వైరస్‌ ని మొదట చైనా వైరస్‌ అన్నారు. ఇప్పుడు ఇండియన్‌ వేరియంట్‌ వంతు వచ్చింది. మన శాస్త్రవేత్తలు, డాక్టర్లు కూడా న్యూ స్ట్రెయిన్‌ ని ఇండియన్‌ వేరియంట్‌ అనే పిలుస్తున్నారు. కేవలం బీజేపీనే దీన్ని అంగీకరించడం లేదు. మన ప్రధానికయితే ఇండియన్‌ వేరియంట్‌ అంటేనే భయం పట్టుకుంది. అందుకే టూల్‌ కిట్‌ అంటూ అర్థం లేని విమర్శలు చేస్తున్నారు అని బీజేపీకి కౌంటర్‌ ఇచ్చారు మాజీ సీఎం కమల్‌ నాథ్‌. వైరస్‌ లు సర్వసాధారణంగా వెనువెంటనే వాటి రూపాన్ని మార్చుకుంటాయి. వాటినే స్ట్రెయిన్‌, మ్యూటెంట్‌ గా పిలుస్తారు. ఇండియాలో వచ్చిన కరోనా మ్యూటెంట్‌ కి సాంకేతికంగా బీ.1.167 గా గుర్తించారు. అయితే మీడియాతో పాటు సోషల్‌ మీడియాలో దీన్ని ఇండియన్‌ వేరియంట్‌ గానే పేర్కొంటున్నాయి. అయితే , దీనిపై కేంద్రం మాత్రం గుర్రుగా ఉంది.

ఇక క‌మ‌ల్ నాథ్ వ్యాఖ్య‌ల‌ను బీజేపీ తోసిపుచ్చింది. దేశ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసేందుకు భార‌త్ వేరియంట్ అంటూ ప్ర‌చారం చేస్తున్న కాంగ్రెస్ టూల్ కిట్ లో భాగంగానే క‌మ‌ల్ నాథ్ వ్యాఖ్య‌లున్నాయ‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ హోంమంత్రి న‌రోత్తం మిశ్రా అన్నారు. అలాగే మాజీ సీఎం కమల్ నాథ్ పై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు భయపడేలా కామెంట్లు చేశారనే ఆరోపణలతో ఆయన పై కేసు నమోదైంది. భోపాల్ లోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఉజ్జయినిలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ఇండియన్ వేరియంట్ అని కమల్ నాథ్ అన్నారు. దీనితో ఆయన నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ 2005లోని సెక్షన్ 188, సెక్షన్ 54 కింద కేసు నమోదు చేశారు. కమల్ నాథ్ వ్యాఖ్యలు ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రజల్లో అయోమయాన్ని పెంచేలా ఉన్నాయని, దేశ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఎఫ్ ఐ ఆర్ లో పోలీసులు పొందుపరిచారు.