Begin typing your search above and press return to search.
స్టార్ హీరో దంపతులపై కేసు నమోదు.. సంచలనం
By: Tupaki Desk | 5 May 2022 6:18 AM GMTతమిళ స్టార్ హీరో సూర్య మరోసారి చిక్కుల్లో పడ్డారు. 'జై భీమ్' మూవీతో దేశాన్ని కదిలించిన ఆయన ఆ సినిమాతో ప్రశంసలే కాదు.. ఓ వర్గం నుంచి విమర్శలు అందుకున్నారు. ఓటీటీ వేదికపై విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకుంది. గిరిజనులకు అండగా నిలుస్తున్న లాయర్ చంద్రు కథే 'జైభీమ్'. ఈ సినిమాలో చంద్రు పాత్రలో హీరో సూర్య నటించారు. ఈ సినిమాలో హీరోగానే కాదు.. నిర్మాత కూడా ఆయనే. మంచి కథా బలం ఉన్న చిత్రాలను ఎంకరేజ్ చేస్తూ '2డీ ఎంటర్ టైన్ మెంట్ పతాకం'పై ఆయన నిర్మిస్తున్నారు.
టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో 'జైభీమ్' మూవీని ఆయన రూపొందించారు. పోలీసులు, కేసులు, కోర్టులు అంటూ సాగే కథ ఇదీ. సామాజిక అసమానతలు, ఒకవర్గాన్ని మరో వర్గం తక్కువగా చూడడం అనేది మన దేశంలో కొత్తేమీ కాదు.. అనాదిగా జరుగుతున్న విషయమే ఇదీ.. కాలక్రమేణ ఇందులో కొంత మార్పు కనిపిస్తోంది. రాజ్యాంగం కల్పించిన హక్కులు అందరికీ అందుబాటులోకి రావడం లేదు.
ఇదే అంశంతో వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన సినిమా 'జైభీమ్'. సినిమా విమర్శలకు ప్రశంసలు అందుకుంది. అయితే ఒక వర్గం నుంచి మాత్రం వ్యతిరేకత వ్యక్తమైంది.
హీరో సూర్య దంపతులకు కోర్టు షాక్ ఇచ్చినట్టైంది. సూర్య, ఆయన సతీమణి జ్యోతికపై తాజాగా కేసు నమోదు చేయాలని సైదాపేట కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇది సంచలనమైంది.
రుద్ర వన్నియార్ కుల చత్రియార్ సంఘం అధ్యక్షుడు సంతోష్ నాయక్ తాజాగా జై భీమ్ సినిమాలో కులాన్ని, మతాన్ని కించపరుస్తున్నారని కోర్టును ఆశ్రయించాడు. సినీ నిర్మాతలు, హీరో సూర్య, నటి జ్యోతికపై సంతోష్ నాయక్ సైదాపేట కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
ఈ పిటీషన్ పై విచారణ జరిపిన మెజిస్ట్రేట్ వెంటనే ఇరువురిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందన్నది ఆసక్తిగా మారింది. దీనిపై నిర్మాతలు కానీ.. ఇటు సూర్య, జ్యోతిక కానీ స్పందించలేదు.