Begin typing your search above and press return to search.

ట్విట్టర్ లో ‘ఆ వీడియో’ షేర్.. స్వరభాస్కర్ పై కేసు

By:  Tupaki Desk   |   18 Jun 2021 2:30 AM GMT
ట్విట్టర్ లో ‘ఆ వీడియో’ షేర్.. స్వరభాస్కర్ పై కేసు
X
ట్విట్టర్ లో ఓ వివాదాస్పద మతసంబంధ వీడియోను షేర్ చేసినందుకు యూపీలో స్వరభాస్కర్ అనే మహిళపై కేసు నమోదైంది. స్వరభాస్కర్ అనే మహిళతోపాటు ట్విట్టర్ ఇండియాపై, మరికొందరిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

యూపీలోని 'ఘజియాబాద్ దాడి వీడియో'గా సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటోన్న క్లిప్పింగ్ లో ఓ మతం వ్యక్తిపై దాడి జరిగినట్టుగా ఉందని పోలీసులు తెలిపారు. అతడిని కొట్టారని.. బలవంతంగా గడ్డం కొరిగించారని వీడియోలో ఉందన్నారు.

అయితే ఆ వీడియోలో బాధితుడి మాటల్ని వెనుకా, ముందు ఆలోచించకుండా స్వరాభాస్కర్ తో సహా చాలా మంది షేర్ చేశారు. ఇది మతకల్లోలానికి దారి తీసిందని పోలీసులు తెలిపారు. దాడికి గురైన బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న దానికి స్వరభాస్కర్ అన్నదానికి పొంతనలేదని.. గడ్డం తీయించిన దానిపైనే బాధితుడు ఫిర్యాదు చేశాడని పోలీసులు తెలిపారు.

దాంతో ఘజియాబాద్ లో జరిగింది వ్యక్తుల మధ్య గొడవే తప్ప రెండు మతాల విభేదాలు కావని పోలీసులు తెలిపారు.అయితే స్వరభాస్కర్, మరికొంత మంది షేర్ చేసిన వీడియోలోని ఆరోపణలు తప్పు అంటూ పోలీసులు చెప్పటంతో ఓ లాయర్ కేసు ఫిర్యాదు చేశాడని.. దీంతో స్వరభాస్కర్ , ఇతరులు , ట్విట్టర్ ఇండియా హెడ్ మనీష్ మహేశ్వరీలు తప్పుడు సమాచారం లక్షలాది మందికి ఫాలోవర్స్ కు అందిస్తూ మతాల మధ్య కలహాలకు కారణమయ్యారని.. ట్విట్టర్ స్వరభాస్కర్ వీడియోపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.

ట్విట్టర్ పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారుడు పోలీసులను కోరాడు. దీంతో పోలీసులు స్వర భాస్కర్ తోపాటు ట్విట్టర్ ఇండియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.