Begin typing your search above and press return to search.
3 రోజులకే విమర్శల్లో చిక్కుకున్న స్టార్ హీరో
By: Tupaki Desk | 4 Nov 2017 12:36 PM GMTసెలబ్రిటీలు ఆచితూచి వ్యవహరించాలి. తమ నోటి నుంచి వచ్చే ప్రతిమాటను ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి. ఏ మాత్రం తప్పు దొర్లినా అడ్డంగా దొరికిపోవటం ఖాయం. తాజాగా అలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు స్టార్ హీరో.. కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన కన్నడ సెలబ్రిటీ ఉపేంద్ర.
ఇటీవల కాలంలో పలువురు సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి రావటానికి కసరత్తుల చేస్తున్నారు. ఆ జాబితా రోజురోజుకి పెరుగుతోంది. తమిళనాడులో కమల్ హాసన్.. రజనీకాంత్ లు రాజకీయ పార్టీలు పెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. మరికొద్దిరోజుల్లో వారు రాజకీయ పార్టీల్ని ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీని ప్రకటించిన పవన్ కల్యాణ్ రానున్న నెల వ్యవధిలో మరింత యాక్టివ్ కానున్ననట్లుగా చెబుతున్నారు. అయితే.. వీరికి భిన్నంగా వ్యవహరించి సంచలనంగా మారారు కన్నడ అగ్రనటుడు ఉపేంద్ర.
మిగిలిన వారి మాదిరి కాకుండా చడీచప్పుడు లేకుండా తన రాజకీయ పార్టీని ప్రకటించారు. తన విలక్షన నటనతో పలు భాషల్లో సుపరిచితుడైన ఆయన కర్ణాటక ప్రజ్ఞావంత జనతాపక్ష పార్టీని పెట్టి అందరిని ఆశ్చర్యపోయేలా చేశాడు. పార్టీ పెట్టిన సందర్భంగా మీడియాను ఉద్దేశించి మాట్లాడిన ఉపేంద్ర పొరపాటున నోరు జారేశారు.అదే ఇప్పుడు ఆయన కొత్త ఇబ్బందుల్ని తెచ్చి పెడుతోంది.
పార్టీ ప్రకటిచిచ సమయంలో మీడియాతో మాట్లాడిన ఉపేంద్ర.. ఎన్నికల సందర్భంగా డబ్బుల ఇచ్చే పార్టీ నేతల దగ్గర డబ్బులు తీసుకోవాలని.. కాకుంటే ఓటుమాత్రం వారికి వేయొద్దని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన ఒక పెద్ద మనిషి ఉపేంద్రపై పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. శేషాద్రిపురం పోలీస్ స్టేషన్లో ఉపేంద్రపై ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసి.. కేసునమోదు చేసే యోచలో ఉన్నారు పోలీసులు. నోరు తెరిచి ఒక వ్యాఖ్య చేసేటప్పుడు ఆచితూచి చేయాలన్న విషయం ఉపేంద్రకు ఇప్పుడు బాగా అర్థమై ఉంటుంది.