Begin typing your search above and press return to search.

రాహుల్ పాదయాత్రకు కేజీఎఫ్ పాట పెట్టారని కేసు నమోదు?

By:  Tupaki Desk   |   5 Nov 2022 9:32 AM GMT
రాహుల్ పాదయాత్రకు కేజీఎఫ్ పాట పెట్టారని కేసు నమోదు?
X
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో భాగంగా భారతదేశం మొత్తం పాదయాత్ర చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు కూడా వచ్చారు. ప్రతిచోటా ఆయనకు జననీరాజనాలు అందుకుంటున్నారు. నేతలంతా చప్పట్లతో స్వాగతం పలుకుతున్నారు. రాహుల్ యాత్రకు మెచ్చి చాలా మంది కదిలివచ్చి మరీ ఆయనకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొంటున్నారు.

స్థానికులతో చేయిచేయి కలుపుతూ నడుస్తూ.. పేదల కష్టాలను వింటున్నారు. అలాగే స్థానిక పార్టీ నాయకులు.. ఇతరులతో సంభాషిస్తున్నారు. అయితే కొంతమంది ఉత్సాహపరులు రాహుల్ పర్యటనకు హైప్ తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలు వివాదాస్పదమవుతున్నాయి.

రాహుల్ పర్యటనను పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి, కాంగ్రెస్ పార్టీ వారు ఇటీవలి కేజీఎఫ్ సినిమాలోని బ్లాక్‌బస్టర్ సాంగ్ "సుల్తాన్" ను వాడేశారు. ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఉపయోగించి రాహుల్ పాదయాత్రను మిక్స్ వీడియోతో ముందుకు వచ్చారు. పాట హిందీ వెర్షన్‌ను ఉపయోగించి రాహుల్ పాదయాత్రల వీడియోలపై సాహిత్యాన్ని జోడించి కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

దీనిపై ఇప్పుడు స్పందించిన కేజీఎఫ్ మ్యూజిక్ కాపీరైట్‌ల యజమాని అయిన ఎంఆర్‌టీ మ్యూజిక్.. ఆ వీడియోను షేర్ చేసిన కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతరులపై కాపీరైట్ ఉల్లంఘన కేసును దాఖలు చేశారు. మార్కెటింగ్, పబ్లిసిటీ కోసం కాంగ్రెస్ పార్టీ అనుమతి/లైసెన్స్ తీసుకోకుండా తమ పాట కంటెంట్‌ను ఉపయోగించిందని పిటిషనర్ ఫిర్యాదులో కోరారు.

కేజీఎఫ్ సంగీతాన్ని ఉపయోగించినందుకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌పై చర్య తీసుకోవాలని కర్ణాటకలోని అధికార పార్టీ బిజెపి ఎంఆర్టీ మ్యూజిక్ సంస్థపై ఒత్తిడి చేసిందని.. అందుకే ఈ కేసు పెట్టారని రాజకీయ వర్గాల్లో పుకార్లు వినిపిస్తున్నాయి. కాకపోతే, ఇప్పటి వరకు చాలా మంది హీరోలు, నాయకుల కోసం కేజీఎఫ్ సంగీతాన్ని ఉపయోగించి చాలా ఈవెంట్‌లను చేశారు. కానీ ఎప్పుడూ కాపీరైట్ కేసులు నమోదు కాలేదు. కానీ కేవలం రాహుల్ గాంధీ పాటపై మాత్రమే పెట్టడంతో ఇది అనుమానాలకు తావిస్తోంది.

ఈ వేధింపులు జాతీయ స్థాయిలోనే కాదు.. ఏపీలోనూ ఉన్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ జనసేన సభకు భూములిచ్చిన గ్రామ రైతులను ఆంధ్రప్రదేశ్‌లో పాలకుల వేధింపులకు గురిచేశారు. ప్రత్యర్థులకు సహకరిస్తే ఎలా ఉంటుందో ప్రతీకార చేష్టలకు దిగారు. ఇప్పుడూ అదే జరిగింది..



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.