Begin typing your search above and press return to search.
చోరీ చేసిన గాడిదతో కేక్ కటింగ్.. కాంగ్రెస్ యూత్ నేతపై కేసు
By: Tupaki Desk | 19 Feb 2022 5:30 AM GMTఅతనో రాజకీయ పార్టీ యువ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడు. అలాంటి అతడి మీద చోరీ కేసు నమోదు చేసి అరెస్టు చేసిన వైనం ఇప్పుడు రాజకీయ కాకకు కారణమైంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మూడు రోజుల పాటు ఘనంగా వేడుకలు నిర్వహించాలని అధికార పార్టీ డిసైడ్ అయితే.. అందుకు భిన్నంగా వినూత్న నిరసనలు చేపట్టాలని విపక్షాలు డిసైడ్ కావటం తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ యువ విభాగమైన ఎన్ఎస్ యూఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ వినూత్నంగా నిరసన చేపట్టాలని నిర్ణయించారు.
ఆయన తన అనుచరులతో కలిసి ఒక గాడిదకు కేసీఆర్ ఫోటోను కట్టి.. దాని కాలితో కేక్ కట్ చేయించిన వైనంపై టీఆర్ఎస్ వర్గీయులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సీఎంను అవమానించేలా ఉన్న ఈ చర్యపై వెంకట్ పై పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో విస్మయానికి గురి చేసే అంశం.. వెంకట్ పై పెట్టిన కేసు.
ముఖ్యమంత్రిని అవమానించారనో.. శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా నిరసనలు చేపట్టారన్న కారణాలను హైలెట్ చేసే కన్నా.. ఆయన గాడిదను దొంగతనం చేశారంటూ ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు. ఇదే విషయాన్ని కరీంనగర్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ మీడియా కు తెలియజేయటంతో సరికొత్త రాజకీయ రగడకు కారణమైంది.
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గాడిదను వెంకట్ దొంగతనం చేయటమే కాకుండా దాన్ని తీవ్రంగా హింసించినట్లుగా తమకు ఫిర్యాదు అందిందని పేర్కొంటూ దానిపై కేసు నమోదు చేశారు. వెంకట్ చర్యతో రాష్ట్రంలోని కొన్ని వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా.. రెచ్చగొట్టేలా వ్యవహరించారన్న ఆరోపణ కూడా చేర్చారు.
తమకు అందిన ఫిర్యాదులపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని.. వెంకట్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయటంతో పాటు.. మూగజీవాలపై హింసకు పాల్పడిన కేసును అదనంగా చేర్చారు.
నిరసనలో ఉపయోగించిన గాడిద ఎక్కడిది? దాని యజమాని ఎవరు. అనే విషయాన్ని వెంకట్ ను ఎన్నిమార్లు ప్రశ్నించినా అతని నుంచి సమాధానం రాలేదని.. దీంతో కేసు నమోదు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. నిరసనకు తెచ్చిన గాడిదను ఎక్కడ నుంచి తీసుకొచ్చారన్న అంశం మీదా విచారణ జరుపుతున్నట్లుగా వెల్లడించారు. రాజకీయంగా సవాలక్ష ఉండొచ్చు కానీ.. ఒక పార్టీ యుూత్ విభాగ అధ్యక్షుడ్ని గాడిదను దొంగతనం చేశారన్న ఆరోపణపై కేసు నమోదు చేస్తారా? అంటూ కాంగ్రెస్ వర్గాలు ఉడికిపోతున్నాయి. మరి.. ఈ కేసు రానున్న రోజుల్లో మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.