Begin typing your search above and press return to search.
కేసుల మీద కేసులు..అజ్ఞాతంలో మాజీమంత్రులు
By: Tupaki Desk | 7 Feb 2020 8:21 AM GMTగత ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతి - అక్రమాలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి విచారణ చేపట్టారు. దీంతో అప్పటి పాలకవర్గంలో ఉన్న వారిపై విచారణ మొదలుపెట్టారు. దీంతో అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వారంతా బిక్కుబిక్కుమంటున్నారు. తప్పించుకోలేక అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. వారిలో ముఖ్యంగా అప్పట్లో మంత్రులుగా హల్ చల్ చేసిన వారంతా ఇప్పుడు కేసుల భయంతో దాక్కుంటున్నారు. కేసుల బారి నుంచి తప్పించుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగన్ దెబ్బకు విలవిలాడుతున్నారు.
ఇప్పటికే రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన అవినీతి - అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశించారు. దీంతో సీఐడీ విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో మాజీమంత్రులతో పాటు ఎమ్మెల్యేలు - నాయకులు ఉన్నారు. దీంతో వారిపై చర్యలకు సీఐడీ చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయంలో ఇప్పటికే ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. వారిలో మాజీమంత్రులు ప్రతిపాటి పుల్లారావు - నారాయణ కూడా ఉన్నారు. ఇక మిగతా వారు అబ్దుల్ జమేదార్ - కొండలరావు - పొలినేని. మండవ నాగమణి - మండవ అనురాధ - బొల్లినేని నరసింహ రావు - భూక్యా నాగమణి తదితరులపై కేసులు నమోదయ్యాయి. భూముల కొనుగోలు వ్యవహారంపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.
అయితే మాజీమంత్రులు ప్రతిపాటి పుల్లారావు - నారాయణలపై ఈ కేసులతో పాటు ఇతర కేసులు కూడా నమోదయ్యాయి. ఒక దళతిత మహిళ భూమి కబ్జా చేశారనే కేసులో వీరిద్దరిపై కేసులు బుక్కయ్యాయి. అమరావతి ప్రాంతంలోని వెంకటపాలెనికి చెందిన దళిత మహిళ భూమి కబ్జా చేశారని కేసు నమోదైంది. దీంతో వారిపై గతం నుంచి ఇప్పటివరకు ఎన్నో కేసులు నమోదయ్యాయి. వీటి నుంచి తప్పించుకోవడానికి మాజీమంత్రులు ప్రతిపాటి పుల్లారావు - నారాయణ కనిపించకుండాపోయారు. మొన్న రాజధాని అంశంపై అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన ప్రతిపాటి పుల్లారావు ఈ కేసులు నమోదు కావడంతో గత రెండు రోజులుగా కనిపించడం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.