Begin typing your search above and press return to search.
కోనసీమ మంటలు... 800 కేసులు
By: Tupaki Desk | 26 May 2022 8:30 AM GMTకోనసీమ ఘటనలో హింసాత్మక ప్రేరిత చర్యలలో ఒక్కరంటే ఒక్క పేరే ప్రముఖంగా వినిపిస్తుంది. అతనే అన్యం సాయి. ఆయన దాదాపు అందరి నాయకులతోనూ ఫొటోలకు ఫోజులిచ్చాడు. అప్పుడు అతడు ఫలానా పార్టీ అని ఎలా అంటారు.. అని కొందరు వాదిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి చాలా అంటే చాలా అనుమానాలే ఉన్నాయి. నిరసనలకు భయపడి తాము ఫైర్ ఇంజన్లు తేలేదని సంబంధిత అధికారిక వర్గాలు చెప్పడం హాస్యాస్పదం. అసలు మంత్రి ఇల్లు తగలబడిపోతుంటే ఎందుకని ఫైర్ ఇంజన్ రాలేదంటే వాళ్లిచ్చిన సమాధానం ఇది.
ఇక ఈ ఘటనలో రెండు వందల మంది ప్రాథమికంగా నిందితులు అని తేలింది. 800 మందిని గుర్తించి విచారించి వీరిపై కూడా కేసులు నమోదు చేసే అవకాశాలున్నాయి అని తెలుస్తోంది. ముఖ్యంగా యాంటి సోషల్ యాక్టివిటీస్ పేరిట నమోదు అయ్యే సెక్షన్లనూ, సంబంధిత చట్టాలనూ వీరికి ఎప్లై చేయనున్నారు. Preventive Detention Act (పీడీ యాక్ట్ ) కింద కూడా వీరికి శిక్ష పడే అవకాశం ఉంది. పలు సెక్షన్ల కింద వీరికి అరెస్టు ఖాయం. బెయిల్ రావడం కూడా కష్టమే అని న్యాయనిపుణులు చెబుతున్నారు. మొత్తం ఇప్పటిదాకా 4 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయని తెలుస్తోంది.
కేసును ఏలూరు రేంజ్ డీఐజీ స్థాయిలో వ్యక్తులు విచారిస్తున్నారు. దర్యాప్తు వేగంగానే సాగుతోంది. ముఖ్యంగా అమలాపురం., రావుల పాలెం పరిసర ప్రాంతాల్లో మళ్లీ అలజడులు రేగే అవకాశాలు ఉండడంతో పోలీసులు అప్రమత్తంగానే ఉన్నారు.
బస్సు యాత్ర నేపథ్యంలో శ్రీకాకుళం లో మరింత బందోబస్తు ఉంది. తూగోలో జరిగిన పరిణామాల ఫలితంగా ఇక్కడ కూడా పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. శ్రీకాకుళం వరకూ ఎస్పీ రాధిక ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మొత్తమ్మీద అటు కోనసీమ ఇటు శ్రీకాకుళం దారులు ఖాకీలతోనే నిండిపోయాయి.
ఇక ఈ ఘటనలో అన్యం సాయి అసలు విలన్ అంటూ సోషల్ మీడియా హోరెత్తిస్తోంది. అతను జనసేన వారితో ఫొటోలు దిగాడు, వైసీపీ పెద్ద తలకాయలతోను ఫొటోలు దిగాడు. ఇప్పుడు పోలీసులు సోషల్ మీడియా పోస్టులన్నింటినీ చదువుతున్నారు.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిని గుర్తించి స్టేషన్లకు పిలిపిస్తున్నారు. దీంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ, భయంతో స్థానిక ప్రజా ప్రతినిధుల దగ్గరకు వెళ్తున్నారు. వాళ్లు మాత్రం తమ వల్ల కాదని, అవన్నీ పోలీసు పరిధిలోనే ఉంటాయని చెప్పి పంపుతున్నారని తెలుస్తోంది.