Begin typing your search above and press return to search.
జేసీ బ్రదర్స్‌ను వదలని కేసులు.. ఈసారి ఏకంగా ఆ కేసు!
By: Tupaki Desk | 26 Nov 2022 7:16 AM GMTఅనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ కీలక నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిలను కేసులు వదలడం లేదు. ఇప్పటికే వీరిపై పలు కేసులు నమోదై ఉన్నాయి. బీ–3 వాహనాలను కొనుగోలు చేసి వాటిని నకిలీ రిజిస్ట్రేషన్లతో, ఫోర్జరీలతో బీ–4 వాహనాలుగా మార్చారని, అధికారులను దూషించారని, దౌర్జన్యం చేశారని, కులం పేరుతో తిట్టారని ఇలా అనేక కేసులు జేసీ ప్రభాకర్‌రెడ్డిపై నమోదై ఉన్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ కేసుల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి జైలుశిక్షను కూడా అనుభవించారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.
కాగా ప్రస్తుతం తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్‌గా ఉన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిలపై హత్యాయత్నం కేసు నమోదైంది.
తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త గండికోట హాజీబాషా అలియాస్ ఘోరా హాజీపై దాడి చేసి గాయపరిచిన ఘటనకు సంబంధించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు, జేసీ అస్మిత్‌రెడ్డిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ మేరకు తాడిపత్రి డీఎస్పీ వీఎన్‌కే చైతన్య వివరాలు వెల్లడించారు.
నవంబర్ 23న తాడిపత్రిలోని మూడో వార్డు పర్యటనకు వెళ్లిన జేసీ అస్మిత్‌రెడ్డి, ఆయన అనుచరుడు ఖాదర్‌బాషా మరికొందరు.. అదే వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు దిగారని అభియోగాలు నమోదయ్యాయి. అంతటితో ఆగకుండా వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో హాజీబాషా తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డి, అనుచరులు ఖాదర్‌బాషా, ఫిల్టర్ బీడీ యజమాని అయూబ్‌తో పాటు మరో పది మంది టీడీపీ నేతలపై 147, 148, 307, 506 రెడ్‌విత్ 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కాగా 2019 ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు జేసీ పవన్ కుమార్‌రెడ్డి, తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్‌రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక తాడిపత్రికి జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి కౌన్సిలర్‌గా గెలుపొందారు. టీడీపీ అత్యధిక స్థానాలు గెలుచుకోవడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.