Begin typing your search above and press return to search.
బాప్ రే..! లిక్కర్ - క్యాష్ ఆ రేంజిలో దొరికిందా..?
By: Tupaki Desk | 6 Dec 2018 3:05 PM GMTబండి ఆపితే మందు. వెహికిల్ చేయగానే నోట్ల కట్టలు. అవీ కాకుంటే లెక్కా పత్రం లేని బంగారు ఆభరణాలు. అదీ కాదంటే విలువైన బహుమతులు. ఏమాత్రం అనుమానం వచ్చినా కట్టలు కట్టలు దొరికిపోతున్నాయి. ఎన్నికల సందర్భంగా పలుచోట్ల పోలీసులు నిర్వహించిన నాకాబందీల్లో.. క్యాష్ మొదలుకొని గంజాయి దాకా పట్టుబడ్డాయి.
డిసెంబరు 6 వరకు పోలీసు విభాగానికి చిక్కిన అక్రమ నగదు రూ.93,08,13,425. దాంట్లో అక్టోబరు 19న ఆదిలాబాద్ సరిహద్దులో దొరికిన క్యాష్ రూ.10 కోట్లు. నవంబరు 7న హైదరాబాద్ పోలీసులకు పట్టుబడ్డ నగదు రూ.7,51,10,300. ఇకపోతే రూ.2,37,98,117 విలువ చేసే 53,769.33 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న లిక్కర్ నాలుగు లక్షల లీటర్లు. 146.6 గ్రాముల ప్లాటినం - 689 గ్రాముల వజ్రాలు - 17.56 కిలోల బంగారం - 121.32 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 6,78,86,373. ఇవి కాకుండా రు.60,05,177ల విలువ చేసే 267.68 కిలోల గంజాయి ఇతర మత్తు పదార్ధాలు కూడా సోదాల్లో దొరికాయి. రూ.1,68,89,075 ల విలువైన బహుమతులను స్వాధీనం చేసుకున్నారు.
కేసుల విషయానికొస్తే 17,882 సెక్యూరిటీ కేసులను నమోదు చేయగా - 90,238 మందిని బైండోవర్ చేశారు. 8,482 లైసెన్సుడు ఆయుధాలను డిపాజిట్ చేసుకున్నారు. 11 అక్రమ ఆయుధాల స్వాధీనం చేసుకున్నారు. 39 ఆయుధాల లైసెన్సులను రద్దు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కేసుల సంఖ్య 1,172. ఇకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్లు 11,862.
మహా కూటమి కట్టల ప్రవాహం అగడం లేదు.. ప్రలోభాలతో ప్రజలను వంచించడమే లక్ష్యంగా పెట్టుకున్న కూటమి అభ్యర్థులు - అనుచరులు - కార్యకర్తలతో అక్రమారాలకు తెర లేపారు... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట టిడిపి అభ్యర్థి గా మెచ్చా నాగేశ్వరరావు పోటీలో ఉన్నారు .. ఈ నేపథ్యంలో ఆయనకు - టీడీపీ పార్టీకి అన్నీ తానే అయి వెనుకుండి నడిపిస్తున్న టిడిపి నేత ఆలపాటి రాము ఇంట్లో ఎలక్షన్ అధికారులు - పోలీసులు సోదాలు జరిపారు.. ఈ సోదాల్లో అక్రమంగా ఉంచిన 14 లక్షల రూపాయల నగదు బయటపడింది.. ఇంత సొమ్మును ఎన్నికల్లో ఓటర్లను కొనుగోలు చేయడానికి తెచ్చినట్టు అధికారులు భావిస్తున్నారు.. నగదు సీజ్ చేసి - నిందితులను అదుపులోకి తీసుకున్నారు... అటు ఖమ్మం త్రీ టౌన్ ఏరియాలో 26 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు... ఈ డబ్బు డోర్నకల్ కూటమి అభ్యర్థి రామచంద్ర నాయక్ కోసం తరలిస్తుండగా పట్టుబడింది.. ఖమ్మం నర్తకి ధియేటర్ వెనుక అభిరామ అపార్ట్ మెంట్ లో మోహన్ రావు ఇంటి నుంచి రూ. 26 లక్షలు స్వాధీనం చేసుకొని నలుగురిని అధపులోకి తీసుకున్నారు..