Begin typing your search above and press return to search.

కొరతపై అసలు మాటను చెప్పేసిన జైట్లీ

By:  Tupaki Desk   |   2 Dec 2016 8:04 AM GMT
కొరతపై అసలు మాటను చెప్పేసిన జైట్లీ
X
పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై మాట్లాడిన ప్రధాని మోడీ..ఒక మాటను చెప్పారు.తాను అనుకున్న దాన్లో తాజా నిర్ణయం ఒక చిన్న అడుగు మాత్రమేనని.. రానున్న రోజుల్లో చాలానే చూస్తారంటూ తర్వాతి రోజుల్లో ఏం జరుగుతుందన్న విషయంపై ఆయన హింట్ ఇచ్చారు. నోట్లరద్దు హడావుడిలో ఉన్నజనాలు ప్రధాని మాటల్ని పెద్దగాపట్టించుకోలేదు.

ఐదు రోజుల కిందట ఆదివారం.. మోడీ మన్ కీ బాత్ సందర్భంగా ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు. నోట్ల రద్దుపై తాను తీసుకున్న నిర్ణయంపై కాసింత భావోద్వేగంతో మాట్లాడిన ఆయన.. తన మాటల్లో నగదు రహిత లావాదేవీల ముచ్చటను బయటపెట్టారు. బ్లాక్ మనీకి చెక్ పెట్టేందుకు.. నల్ల కుబేరులకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వటంతో పాటు.. పన్ను పరిధిలోని ప్రతి ఒక్కరిని తీసుకురావాలన్న ఆలోచనతోనే నగదు రహిత లావాదేవీల మాటను చెప్పారని చెప్పాలి. మోడీ మాట్లాడిన తర్వాత కొందరు ముఖ్యమంత్రులు క్యాష్ లెస్ లావాదేవీలపై చర్చలు జరపటంతో పాటు.. అందుకు తగ్గ ఏర్పాట్లను షురూ చేశారు.

ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. క్యాష్ లెస్ ప్రయోగాన్ని సిద్ధిపేటలో అమలు చేయాలని తాను భవిస్తున్నట్లు చెప్పారు. ఆయన నోటి నుంచి ఆ మాట వచ్చిందో లేదో.. యుద్ధప్రాతిపదికన సిద్దిపేటలో నగదు రహిత లావాదేవీలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇదిలా ఉంటే.. కరెన్సీ నోట్ల కొరత దేశాన్ని పట్టి పీడిస్తోంది. ఒకటో తారీఖున వచ్చేజీతాల్ని నోట్లలో చేతికి తీసుకునేందుకు విపరీతంగా ప్రయత్నించిన సామాన్యులు.. చేతికి అందాల్సిన మొత్తాల్ని అందుకోకపోవటంతో తీవ్ర అవస్థలకు గురి అవుతున్నారు. ఇలాంటి వేళ.. కరెన్సీ కష్టాలు ఎప్పటికి తీరుతాయన్న సందేహం ప్రతి ఒక్కరిలో నెలకొంది.

ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ఆర్థికమంత్ర అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. దేశాన్ని డిజిటల్ బాట పట్టించేందుకు.. నగదు రహిత లావాదేవీల్ని ప్రోత్సహించటానికి వీలుగా.. నోట్ల చలామణీని తగ్గించినట్లుగా చెప్పారు. పెద్దనోట్ల రద్దుకు ముందు అందుబాటులో ఉన్న మొత్తాన్ని తిరిగి తీసుకొచ్చే ఉద్దేశం తమకులేదని అరుణ్ జైట్లీ చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో డెబిట్ కార్డులు.. ఈ వ్యాలెట్ల వినియోగాన్నిపెంచేందుకు వీలుగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా జైట్లీ ప్రకటించారు. ఆర్థికమంత్రి క్లారిటీ ఇచ్చిన ప్రకారం.. నోట్ల కొరత అన్నది మరికొంత కాలం సాగటం పక్కా అన్న విషయాన్ని చెప్పేసినట్లేనని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/