Begin typing your search above and press return to search.
మూడు లక్షలకు మించి చెల్లిస్తే తిప్పలే
By: Tupaki Desk | 1 Feb 2017 1:38 PM GMTకేంద్ర బడ్జెట్ లో నగదు లావాదేవీలకు గరిష్ట పరిమితి విధించారు. 3 లక్షలకి మించి నగదు ట్రాన్సాక్షన్స్ చెయ్యకూడదు. 3 లక్షలు మించితే ఆన్లైన్ బ్యాంకు ట్రాన్సక్షన్స్ మాత్రమే చెయ్యాలి .. ఇవాళ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆయన ఈ అంశాన్ని వెల్లడించారు. మూడు లక్షలపైన నగదు లావాదేవీ ఉండ కూడదని సిట్ చేసిన సూచనలను ప్రభుత్వం ఆమోదించినట్లు మంత్రి తెలిపారు. ఈ నిబంధన ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి అమలులోకి రానుంది.
నల్లధనం - పన్ను ఎగవేతను అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు సిట్ ను ఏర్పాటు చేసింది. మాజీ న్యాయమూర్తి ఎంబీ షా నేతృత్వంలోని సిట్ నల్లధనం నిర్మూలనపై అయిదు నివేదికలను సుప్రీంకోర్టుకు సమర్పించింది. గత ఏడాది నవంబర్ 8న నల్లధనం నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. రాజకీయ పార్టీలకు వస్తున్న విరాళాలపైన కూడా మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేశారు. ప్రతి వ్యక్తి నుంచి రెండు వేలకు మించి విరాళం ఉండరాదని నిర్ణయించారు. చెక్ లేదా డిజిటల్ రూపంలో పార్టీలు విరాళాలు స్వీకరించాలన్నారు. రాజకీయ పార్టీల విరాళాలు చెక్కు లేదా డిజిటల్ రూపంలోనే చెల్లించాలని అవి కూడా రూ. 20 వేలకు మించితే లెక్కలు చూపాలని ఆదేశించారు. ఆదాయ పన్ను చట్టం ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు పన్ను రిటర్నులు దాఖలు చేయాలని జైట్లీ ప్రకటించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రజల నుంచి విరాళాలు సేకరించిన విధంగా రాజకీయ విరాళాల సేకరణ ఉండాలని జైట్లీ అన్నారు. ఒబామా కూడా ఒక దాత నుంచి 50 డాలర్లు - మరో దాత నుంచి 100 డాలర్లు - ఇలా ఆయన విరాళాలను సేకరించారు. అవన్నీ ఆన్ లైన్ ద్వారానే జరిగాయి, ఆ పద్థతి వల్ల ఎటువంటి సమస్య లేదు, అదే తరహాలో మనం కూడా విరాళాలను సేకరిద్దామని జైట్లీ అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/