Begin typing your search above and press return to search.
టీ ఏసీబీ వరుస రాంగ్ షాట్స్?
By: Tupaki Desk | 19 Aug 2015 5:21 AM GMTఓటుకు నోటు వ్యవహారంలో ఇప్పటివరకూ ఆచితూచి అడుగులేస్తూ.. ఎక్కడా ఎదురుదెబ్బల్లేకుండా చూసుకుంటున్న టీ ఏసీబీ ఇప్పడిప్పుడే తప్పటడుగులు వేస్తుందా? ఈ కేసు భవిష్యత్తును తేల్చే రూ.50లక్షల మొత్తం ఎక్కడ నుంచి వచ్చిందన్న విషయంపై సరైన ఆధారాలు దొరక్క తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆ శాఖ అధికారులు తప్పటడుగులు వేస్తున్నారా? రూ.50లక్షలకు సంబంధించిన ఆధారంపై మరిన్ని ఆశలు పెట్టుకున్న అధికారులు ఇప్పుడేం చేయలేక కిందామీదా పడుతున్నారా? లాంటి ప్రశ్నలెన్నో వినిపిస్తున్నాయి.
ఓటుకు నోటు కేసులో స్టీఫెన్ సన్ కు ముడుపులు ముట్టజెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వీడియోసాక్ష్యంతో తిరుగులని ఆధారాన్ని చేజిక్కించుకున్నప్పటికీ.. ఆ హడావుడిలో అసలు విషయాన్ని మిస్ చేసినట్లుగా చెబుతున్నారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు రూ.50లక్షలు ముట్టజెబుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడేలా ప్లాన్ చేసినప్పటికీ.. సదరు రూ.50లక్షలు ఎక్కడ నుంచి తీసుకొచ్చారు? వాటి వెనుక ఎవరున్నారన్న విషయం మీద మాత్రం ఇప్పటివరకూ ఒక్క ఆధారం దొరకని పరిస్థితి.
స్టీఫెన్ సన్ కు ముట్టజెప్పేందుకు వినియోగించిన అరకోటి విషయంలో టీ ఏసీబీ అధికారులు వరుసగా తప్పటడుగులు వేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న సమయంలో.. అరకోటికి సంబంధించి టీడీపీ ఎంపీ సీఎం రమేష్ పేరు వినిపించింది. ఆయన వ్యాపార సంస్థకు చెందిన మొత్తాన్ని వినియోగించారని..ఆయనకు నోటీసులు ఇస్తారన్న ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా సీఎం రమేష్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ.. అలాంటి ఆధారమే లభిస్తే.. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతాననంటూ వ్యాఖ్యానించటమే కాదు.. తమపై విమర్శలు చేస్తున్న వారు రాజకీయ సన్యాసం తీసుకుంటారా అంటూ విరుచుకుపడటం తెలిసిందే.
అనంతరం ఒక కేంద్రమంత్రి హస్తం ఉందన్న వాదనలు వినిపించాయి. కానీ.. అది ఉత్తదేనని తేలింది. ఆ తర్వాత పలు పేర్లు తెర మీదకు వచ్చినా.. వాటికి సంబంధించిన ఆధారాలు లభించలేదు. తాజాగా దివంగత టీడీపీ నేత ఆదికేశవుల నాయుడు కుమారుడు శ్రీనివాసుల నాయుడుకు చెందిన కంపెనీ నుంచి నిధులు అందినట్లుగా భావిస్తూ.. బెంగళూరులోని ఆయనకు నోటీసులు జారీ చేశారు.
టీ ఏసీబీ నుంచి నోటీసులు అందుకున్న వెంటనే.. హైదరాబాద్ కు వచ్చిన ఆయన.. ఆరు గంటల పాటు విచారణను ఎదుర్కొని.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పటంతో.. తగిన ఆధారాలు లభించక మంగళవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఆయన బయటకు వచ్చేశారు. విచారణ సందర్భంగా అధికారులు గుర్తించిన అంశం.. ఓటుకు నోటు వ్యవహారంలో శ్రీనివాసుల నాయుడికి పెద్దగా అవగాహన లేదని. కేవలం రేవంత్ రెడ్డికి సన్నిహితుడన్న ఒక్క విషయం తప్పించి.. ఈ ఉదంతంలో ఆయన పాత్ర లేదన్న విషయాన్ని అధికారులు గుర్తించినట్లుగా చెబుతన్నారు.
మిగిలిన విషయాల్లో పక్కాగా ఉంటున్న టీ ఏసీబీ.. అరకోటి నిధుల విషయంలో మాత్రం మరో తప్పటడుగు వేశారని.. అందుకు తాజాగా శ్రీనివాసుల నాయుడ్ని విచారణకు పిలిపించి.. ఏమీ చేయలేక ఊరుకుండిపోవటంగా చెబుతున్నారు. తన వ్యక్తిగత కార్యదర్శి విష్ణు చైతన్యను నాలుగు రోజుల్లో ఏసీబీ అధికారుల వద్దకు తానే తీసుకొస్తానంటూ ఆయన చెబుతున్న తీరు.. తమకీ ఉదంతంలో ఏ మాత్రం సంబంధం లేదన్న విషయాన్ని చెబుతుందన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా.. అరకోటి విషయంలో మాత్రం టీ ఏసీబీ అధికారులు వరుస తప్పులు చేస్తున్న భావన వ్యక్తమవుతోంది.