Begin typing your search above and press return to search.

జగన్ పై కేసుల్లో క్యాష్ పిటిషన్.. హైకోర్టు లో వాదనలు

By:  Tupaki Desk   |   2 Nov 2021 7:30 AM GMT
జగన్ పై కేసుల్లో క్యాష్ పిటిషన్.. హైకోర్టు లో వాదనలు
X
జగన్ అక్ర మాస్తుల కేసు లో తనను తొలగించాలని హెటిరో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ హై కోర్టు లో క్వాష్ పిటిషన్‌ దాఖలు చేశారు. సీబీఐ అనవసరం గా తనను ఈ కేసు లో ఇరికించిందని, తన పేరు ను తొలగించాలని హై కోర్టును కోరారు. జగన్ నమోదైన కేసుల్లో తమను తప్పించాలని పలు కంపెనీల యజమానులు, అధికారులు హై కోర్టు ఆశ్రయించారు. ఇప్పటికీ ఈ కేసు పై విచారణ కొనసాగుతోంది. క్విడ్ ప్రో కో వ్య‌వ‌హారం లో ఇప్ప‌టికే పలువురు ఈ కేసుల నుంచి బ‌య‌ట‌ పడ్డారు. హెటిరో త‌ర‌ఫున ఒక క్వాష్ పిటిష‌న్‌ పై హై కోర్టు విచార‌ణ‌ జరుగుతోంది. సోమవారం విచార‌ణ జ‌రిగింది.. ఈ రోజు కూడా ఈ కేసు పై హై కోర్టు విచార‌ణ చేపట్టనుంది.

జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్ లో పెట్టు బడులు పెట్టాలంటూ త‌మ‌ ను జ‌గ‌న్ ఎలాంటి ఒత్తిడి చేయ‌ లేద‌ని ఆ సంస్థ కోర్టు కు తెలిపింది. త‌మ‌ కు సెజ్ ల‌ లో కేటాయించిన స్థ‌లాలను నిబంధనల ప్రకారమే పూర్తి చేశా మని పిటిషనర్ తరపు న్యాయ వాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఇందులో క్విడ్ ప్రో కో ఆధారాలు ఏమీ లేవ‌ని తెలిపారు. జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్ కు సంబంధించి డెలాయిట్ నివేదిక‌ ను ఆధారం గానే పెట్టుబ‌డులు పెట్టినట్లు కోర్టు కు వివ‌రించారు. ప్ర‌భుత్వం చేత‌ ల‌బ్ధి పొంది, జ‌గ‌న్ కంపెనీల్లో పెట్టు బ‌డులు పెట్టార‌ని సీబీఐ అభియోగం మోపింది. దీన్నే క్విడ్ ప్రో కో గా సీబీఐ చెబుతోంది. నిబంధ‌న‌ల మేర‌కే త‌మ‌కు కేటాయింపులు జ‌రిగాయని, జ‌గ‌న్ కంపెనీల్లో పెట్టు బ‌డులు పెట్టి నందుకు కాద‌ని వివిధ సంస్థ‌లు వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇండియా సిమెంట్స్, హెటిరో వంటి కంపెనీలు క్వాష్ పిటిష‌న్ల‌తో హై కోర్టును ఆశ్ర‌యించాయి.

జ‌గ‌న్ పై న‌మో దైన కేసుల వ్య‌వ‌హారం నుంచి త‌మ‌ను త‌ప్పించాల‌ని కంపెనీల య‌జ‌మానుల, అధికారుల పిటిష‌న్ల‌ పై విచార‌ణ‌ హై కోర్టు లో కొన‌సాగుతోంది. ఇప్ప‌టి కే ప‌లువురు అధికారులు బ‌య‌ట‌ప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జ‌గ‌న్ బ‌య‌ట‌ కు వ‌చ్చాకా సీబీఐ విచార‌ణ‌, క్విడ్ ప్రో కో కేసులు నమోదు చేశారు. ఆ కేసు ల్లో ఆయన రిమాండ్ ఖైదీగా 16 నెల‌ల పాటు చంచల్ గూడ జైల్లో ఉన్నారు.