Begin typing your search above and press return to search.
‘మోడీ’ వేసిన దెబ్బతో గోవా విలవిల
By: Tupaki Desk | 12 Nov 2016 4:34 PM GMTపెద్ద నోట్లపై ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంతో దేశ వ్యాప్తంగా వ్యాపార వర్గాలు హాహాకారాలు చేస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో వ్యాపార సంస్థలు మాత్రమే కాదు.. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం విస్తుపోతున్నాయ్. కొందరు ముఖ్యమంత్రులు మోడీ నిర్ణయంపై తీవ్రస్థాయిలో మండిపడితే.. మరికొందరు మాత్రం పైకి విమర్శలు చేయకున్నా.. లోలోన మాత్రం తీవ్ర అసంతృప్తికి గురి అవుతున్నారు.
పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుబేరులకు హార్ట్ ఎటాక్ వచ్చేలా చేయగలిగామన్న మాటను చెబుతున్నా.. వారి సంగతి తర్వాత.. ఈ నిర్ణయంతో సామాన్యుడి నుంచి సర్కారు మీద తీవ్ర ప్రభావం పడుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదని చెబుతున్నారు. ఎలాంటి ఆలోచన లేకుండా ఖర్చు చేసే వారు సైతం.. ఇవాళ.. ఆచితూచి ఖర్చు చేయటమే కాదు.. చివరకు టిఫిన్ సెంటర్లో పెట్టే ఖర్చు విషయంలోనూ తీవ్ర జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
చేతిలో ఉన్న కాసిన్ని డబ్బులు అయిపోతే.. చిల్లర డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ తిరగటానికి రోజుల తరబడి క్యూలలో నిలుచునే కన్నా.. వీలైనంతవరకూ ఖర్చును తగ్గించుకోవటంపైనే ప్రజలంతా దృష్టి సారిస్తున్నారు. ఇప్పుడు కొనటం లాంటి వాటి విషయంలో కంటే కూడా చేతిలో ఉన్న పెద్ద నోట్లను వీలైనంత త్వరగా లిక్విడ్ చేసుకోవటంపైనే అందరూ దృష్టి సారిస్తున్నారు. దీంతోపాటు.. ఏటీఎంలు సరిగా పని చేయకపోవటంతో ఎప్పుడు ఎలాంటి అవసరం అవుతుందోనన్న ఆలోచనతో చేతిలో ఉన్న నగదును ఖర్చు చేయటానికి సుతారం ఇష్టపడని పరిస్థితి.
ఇలాంటి వైఖరితో నిత్యవసరాల మీదే పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అలాంకటిది విలాసవంతమైన వ్యవహారాలపై మరెంత ప్రభావం చూపిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియా లాస్ వెగాస్ గా పేరున్న గోవా క్యాసినో ఇప్పుడు వెలవెలలాడిపోతోంది. నిత్యం కోట్లాది రూపాయిలు చేతులు మారే పరిస్థితి ఇప్పుడే మాత్రం కనిపించటం లేదు. పెద్ద నోట్ల రద్దుతో క్యాసినోలలో రోజువారీగా జరిగే కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితం అయినట్లుగా చెబుతున్నారు. పాత పెద్దనోట్లకు నో చెప్పేయటంతో చాలావరకూ ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. కొన్ని క్యాసినోలు మాత్రం అందుకు భిన్నంగా పెద్దనోట్లకు ఓకే చెబుతున్నాయి. కాకుంటే.. నోట్లను డిస్కౌంట్ చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.
ఇలాంటి క్యాసినోలపై పెద్దనోట్ల రద్దు ప్రభావం కొంత ఉంటే.. మొత్తంగా గోవా క్యాసినో మార్కెట్ కు మాత్రం పెద్ద నోట్ల రద్దు పెద్ద దెబ్బే వేసినట్లుగా చెబుతున్నారు. ప్రధాని మోడీ తీసుకున్న తాజా నిర్ణయంతో గోవా సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. క్యాసినోల మీద రాష్ట్ర సర్కారుకు వచ్చే ఆదాయం మీద పెద్దనోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/