Begin typing your search above and press return to search.

రేపటి నుంచి ఎటీఎంల నుంచి రూ.4500 విత్ డ్రా

By:  Tupaki Desk   |   31 Dec 2016 4:41 AM GMT
రేపటి నుంచి ఎటీఎంల నుంచి రూ.4500 విత్ డ్రా
X
సిత్రం కాకుంటే మన డబ్బుల్ని మనం తీసుకోవటానికి కూడా రేషన్ రోజులు వచ్చేశాయ్. అచ్చేదిన్.. అచ్చేదిన్ అన్న మాటలకు అర్థం ఇదా? అని సగటుజీవి అనుకునేలా చేస్తోంది మోడీ సర్కారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఏటీఎంల నుంచి రోజువారీ విత్ డ్రా మొత్తాన్ని రూ.2500లకు పరిమితం చేయటం తెలిసిందే. ఇలాంటి కష్టాలు మహా అయితే వారం.. పది రోజులు అనుకున్న స్థానే.. యాభై రోజుల తర్వాత కూడా ఇంచుమించు అదే పరిస్థితులన్నట్లుగా ఉంది మోడీ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం.

డిసెంబరు 31 వరకు రోజువారీగా ఏటీఎంల నుంచి విత్ డ్రా చేసుకునే రూ.2500 నుంచి రూ.4500లకు పెంచుతూ భారత రిజర్వ్ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త డెసిషన్ జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్లుగా వెల్లడిచింది. శుక్రవారం రాత్రి తర్వాత వెల్లడించిన ఈనిర్ణయాన్ని పలువురు న్యూఇయర్ గిఫ్ట్ గా అభివర్ణిస్తుంటే.. యాభై రోజుల తర్వాత కూడా ఈ పరిమితులేందని మరికొందరు మండి పడుతున్న పరిస్థితి.

ఏది ఏమైనా.. ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకునే నగదు మీద ఆంక్షలు మరికొంతకాలం కొనసాగుతాయన్న సంకేతాలు తాజా నిర్ణయం స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు. ఇదిలా ఉంటే.. బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసుకునే మొత్తం విషయంలో మాత్రం ఎలాంటి మార్పుచేయలేదు. ఇప్పటివరకూ ఉన్నట్లే వారానికి రూ.24వేల వరకూ గరిష్ఠ మొత్తాన్ని చెక్కు ద్వారా నగదు తీసుకునే వెసులుబాటు ఉన్న విషయం తెలిసిందే. అయితే.. బ్యాంకుల్లో నగదు కారణంగా రూ.24వేల మొత్తం చాలావరకూ బ్యాంకులు ఇవ్వని పరిస్థితి. ఏదీ ఏమైనా.. ఎనీటైంమనీ కాస్తా.. మోడీ నోట్ల రద్దు పుణ్యమా అని ఎనీటైంమూత అన్న పేరును తెచ్చుకున్న ఏటీఎంల నుంచి న్యూఇయర్ రోజు నుంచి రూ.4500 విత్ డ్రా చేసుకునే వీలుంది. మరి.. ఇది ఎంతవరకు అమలవుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/