Begin typing your search above and press return to search.
టీవీ నటుడి కార్లో 43 లక్షలు
By: Tupaki Desk | 10 Dec 2016 5:13 AM GMTఓవైపు సామాన్యులు రెండు వేల రూపాయల కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి నానా అవస్థలు పడుతుంటే.. అక్కడక్కడా కొందరు బడా బాబుల దగ్గర లక్షలు కోట్ల రూపాయల మొత్తంలో కొత్త నోట్లు దొరుకుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా చెన్నైలో ఐటీ దాడుల్లో బయటపడ్డ కొత్త నోట్లు విస్మయానికి గురి చేయగా.. మరోవైపు మధ్య ప్రదేశ్ లో ఓ టీవీ నటుడు ఏకంగా 43 లక్షల రూపాయల కొత్త నోట్లతో సవారీ చేస్తూ పోలీసులకు పట్టుబడటం అనేక సందేహాలకు తావిస్తోంది. ఆ నటుడి పేరు రాహుల్ చెలాని. అతను హిందీ సీరియళ్లతో పాటు కొన్ని సినిమాల్లోనూ నటించాడు. ‘సావధాన్ ఇండియా’ లాంటి షోలు కూడా చేశాడు.
మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ కు సమీపంలో పోలీసులు మామూలుగా సోదాలు నిర్వహిస్తుండగా.. ఇన్నోవా కార్లో తన బంధువు.. డ్రైవర్ తో కలిసి వచ్చాడు రాహుల్. పోలీసులకు ఎందుకో అనుమానం వచ్చి కారును చెక్ చేయగా.. అందులో కొత్త 2000.. 500 నోట్ల కట్టలు కనిపించాయి. వాటిని లెక్క పెట్టగా లెక్క రూ.43 లక్షలుగా తేలింది. కొత్త నోట్ల కోసం దేశవ్యాప్తంగా నానా తంటాలు పడుతున్న నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తంలో నోట్లు వెళ్తున్నాయంటే ఇందులో ఏదో మతలబు ఉందని పోలీసులకు అనుమానం వచ్చి రాహుల్ తో పాటు మిగతా ఇద్దరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి కారు మీద ‘యాంటి కరెప్షన్ సొసైటీ ప్రెసిడెంట్’ అనే స్టిక్కరింగ్ ఉండటం విశేషం. ఓ ఇంటి అమ్మకానికి సంబంధించిన డబ్బులు ఇవని.. ఇంకేదో అని రాహుల్ పోలీసులకు ఏదో కథ చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినా.. వాళ్లు వినలేదు.