Begin typing your search above and press return to search.
పార్లమెంటులో 'క్యాసినో' వివాదమా ?
By: Tupaki Desk | 5 Feb 2022 4:30 AM GMTగుడివాడలో జరిగిందని చెబుతున్న క్యాసినో వివాదాన్ని పార్లమెంటులో లేవనెత్తేందుకు టీడీపీ రెడీ అయ్యింది. అలాగే జాతీయ స్థాయి దర్యాప్తు సంస్ధలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, డీఆర్ఐ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలకు కూడా ఫిర్యాదు చేయబోతున్నట్లు జాతీయ అధికార ప్రతినిధి వర్ల రామయ్య చెప్పారు. మొన్నటి సంక్రాంతి పండుగ సందర్భంగా గుడివాడ కే కన్వెన్షన్ హాలులో క్యాసినో జరిగిందని టీడీపీ నేతలు కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నారు. గడచిన రెండున్నరేళ్ళల్లో ఏ అంశంపైన కూడా ఇంతగా పట్టుబట్టని టీడీపీ క్యాసినో వివాదంపైన మాత్రం పట్టుబడుతోంది.
టీడీపీ నేతలు చెబుతున్నట్లు తన కే కన్వెన్షన్ లో క్యాసినో జరగలేదని మంత్రి కొడాలి నాని చెప్పారు. సరే క్యాసినో జరిగిన వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి కాబట్టి... క్యాసినో జరిగిందనే అనుకుందాం. అయితే దాని వల్ల మామూలు జనాలకు దీనితో ఎలాంటి సంబంధం లేదు. క్యాసినో ఆడదలచుకున్న వాళ్ళెవరో వెళతారు లేని వాళ్ళు వెళ్ళరు. మామూలు జనాలకు సంబంధం ఉన్న అనేక అంశాలను వదిలిపెట్టేసి ఎందుకు క్యాసినో అంశాన్ని టీడీపీ సీరియస్ గా తీసుకోవడమే ఆశ్చర్యంగా ఉంది.
పైగా ఈ అంశాన్ని జాతీయ స్థాయి అంశంగా మార్చుతామని చెప్పటమే ఇంకా విచిత్రంగా ఉంది. అసలు తాము టేకప్ చేసిన అంశానికి జనాలు ఏమన్నా విలువిస్తున్నారా అన్నది కూడా టీడీపీ చూసుకోవటం లేదు. జనాలకు సంబంధంలేని ఇలాంటి అంశాలు ఎన్నింటిని పట్టుకున్నా ఎలాంటి ఉపయోగం ఉండదని టీడీపీ నేతలు గ్రహించటం లేదు. కేవలం గుడివాడకు మాత్రమే పరిమితమైన ఒక అంశాన్ని పట్టుకుని ఇంతకాలం అనవసరంగా లాగుతున్నారంటేనే కొడాలి నాని మీదున్న వ్యతిరేకతతోనే అని అర్ధమైపోతోంది.
నిజంగానే కొడాలిని ఇరుకున పెట్టాలని టీడీపీ అనుకుంటే ఇంకేమైనా అంశాలుంటే గుర్తించాలి. పౌరసరఫరాల శాఖలో ఏమైనా ఇబ్బందులున్నాయా అనే అంశాలను అధ్యయనం చేయాలి. ఎందుకంటే పౌరసరఫరాల శాఖ కొన్ని లక్షల మందికి సంబంధించిన శాఖ. రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలు, బియ్యం సేకరణ, పప్పుధాన్యాల సేకరణ, పంపిణీ లాంటి విషయాలను ప్రస్తావిస్తే టీడీపీకి ఏమైనా మైలేజీ వచ్చే అవకాశముంది.
అంతేకానీ గుడివాడలో క్యాసినో జరిగిందని, కోళ్ళ పందేలు, పేకాట జరిగిందనే చిల్లర అంశాలను పట్టుకుంటే ఏమీ ఉపయోగం ఉండదు. పేకాట, కోళ్ళ పందేలు, గుండాట లాంటివి అన్ని చోట్లా రెగ్యులర్ గా జరిగేవే. ఇలాంటి అంశాన్ని పట్టుకుని జాతీయస్థాయిలో ప్రస్తావిస్తామని చెప్పటం అంటే మరీ విడ్డూరంగా ఉంది. పార్లమెంటులో ప్రస్తావించేందుకు ఇంతకన్నా ముఖ్యమైన అంశాలు టీడీపీకి లేవా ?