Begin typing your search above and press return to search.
నాని ఎఫెక్ట్ తో కుల పెద్దలంతా కలిసి మాట్లాడుకున్నారా?
By: Tupaki Desk | 18 July 2019 4:53 AM GMTఇప్పటివరకూ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎదురుకాని సీన్ ఒకటి ఈ మధ్యన తరచూ ఎదురవుతోంది. తనను వేలెత్తి చూపించేటోళ్లు తన రాజకీయప్రత్యర్థులు చాలామందే ఉన్నా.. పార్టీ నేతలెవ్వరూ తొందరపడి మాట జారే అవకాశాన్ని ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవటం తెలిసిందే. అదే సమయంలో పార్టీ నేతలు క్రమశిక్షణ గీత దాటినా వారిని మాటలతో.. చూపులతో కంట్రోల్ చేయటమే తప్పించి చర్యలు తీసుకోవటం కనిపించదు.
అలాంటిది విజయవాడ ఎంపీ కేశినేని నాని మాత్రం.. పార్టీని.. పార్టీలోని పలువురు నేతల్ని టార్గెట్ చేస్తూ.. ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ మహా ఇబ్బందికరంగా మారటం తెలిసిందే. కేశినేని తీరు టీడీపీలో ఇప్పుడో హాట్ టాపిక్ గా మారింది. ఆయన విషయం మీద మాట్లాడటానికి తమ్ముళ్లు భయపడిపోతున్నారట.
తెగించినోడు దేన్ని లెక్క చేయని తీరులో నాని తీరు ఉందని.. ఆయన ప్రస్తావన తెచ్చి పలుచన అయ్యే కన్నా.. ఈ ఎపిసోడ్ తో తమకేమాత్రం సంబంధం లేదన్నట్లుగా ఉండిపోవటం మేలుగా చెబుతున్నారు. నాని వరుస ట్వీట్లు చూస్తుంటే.. తనకు తాను ఒక ఇమేజ్ ను సృష్టించుకునే ప్రయత్నంలో ఉన్నారన్న మాట వినిపిస్తోంది.
ఇమేజ్ బిల్డింగ్ లో భాగంగా నేతలు కిందామీదా పడటం మామూలే అయినా.. ఇలా అడ్డ బ్యాటింగ్ తో ఇష్టం వచ్చినట్లుగా ఆడేస్తున్న ఆట అంతిమ లక్ష్యం ఏమిటన్నది ఒక ప్రశ్న అయితే.. నాని కారణంగా తాము నమ్ముకున్న పార్టీ నట్టేట మునిగిపోవటం ఒక ఎత్తు అయితే.. ఇంతకాలం తమకు మించినోళ్లు లేరన్నట్లుగా ఉండే సామాజిక వర్గానికి తలవంపులు తెచ్చేలా నాని వ్యవహరిస్తున్నారన్న కంప్లైంట్ తో నానికి చెందిన సామాజిక నేతలంతా కలిసి తాజాగా బెజవాడలో ఒక చోట జమైనట్లుగా తెలుస్తోంది. వారంతా కూర్చొని నాని కారణంగా తాము నమ్ముకున్న పార్టీకి జరిగిన నష్టం ఎంతన్న దానిపై చర్చించుకున్నట్లుగా సమాచారం. తాము మాట్లాడుకున్న మాటల్ని.. ఒక పెద్ద మనిషి ద్వారా నాని వద్దకు రాయబారాన్ని పంపాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరి.. దీనిపై నాని ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.