Begin typing your search above and press return to search.

కులం గెలిచింది... కులం ఓడింది...?

By:  Tupaki Desk   |   10 April 2022 1:37 PM GMT
కులం గెలిచింది... కులం ఓడింది...?
X
ఏపీలో రాజకీయాలు అంటే కులాలే ముందుంటాయి. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి డౌట్లూ లేవు. కానీ కులాలే ఓట్లు తెస్తాయా అన్నది కూడా ఆలోచించాల్సి విషయం. ఎన్ని చెప్పుకున్నా ఈ రోజుకూ అగ్ర వర్ణాలే రాజకీయాలను శాసిస్తున్నారు. దానికి రీజన్ ఏమిటి అని చెప్పాలీ అంటే వారే అర్ధ, అంగ బలం కలిగి ఉన్నారు. అలాంటి వారిలో కొంతమందికి కులం పరంగా చూస్తే బలం తక్కువ. వారి ఓట్ల శాతం కూడా తక్కువ.

మరి వారి సమర్ధత చూస్తారా లేక కులాల లెక్కలు చూస్తారా అంటే రెండవదే రైట్ అన్నట్లుగా జగన్ 2.0 క్యాబినెట్ కూర్పు చెబుతోంది. కేవలం సోషల్ ఇంజనీరింగ్ ని నమ్ముకుని వారితోనే అంతా అన్నట్లుగా ఈ మార్పు, ఎంపిక ఉందని అంటున్నారు. దీని వల్ల బలమైన నేతలు చాలా మంది క్యాబినెట్ లోకి రాకుండా పోయారు. ఒక ఫార్ములాతో ఈ సెలెక్షన్ చేయడం వల్లనే ఇలా జరిగిపోయింది అన్న విమర్శలు ఉన్నాయి.

ఇలా ఒక పారామీటర్ ని పెట్టుకుని ఎంపిక చేయడంతో చాలా మందికి పదవులు దక్కకుండా పోయాయి. అంతవరకూ ఎందుకు జగన్ని గత పుష్కర కాలంగా నెత్తిన పెట్టుకుని ఆయన్ని మోసిన బలమైన రెడ్డి సామాజికవర్గం తాజా కూర్పులో ఇబ్బంది పడిపోయారు. పార్టీకి గొడ్డు చాకికి చేసిన వారు, జగన్ని కంటికి రెప్పలా కాపాడుకున్న వారు సైతం మంత్రి అనిపించుకోలేకపోయారు.

నిజంగా వారికి కూడా తాము జీవితంలో మినిస్టర్ కుర్చీ ఒక్కసారి అయినా ఎక్కాలని ఉంటుంది. కానీ ఈ రకమైన లెక్కలతో వారు జీవిత కాలంలో వైసీపీలో అందునా జగన్ ఎంపికలో మంత్రులను కాలేమని అనుకుంటే తప్పు ఎవరిదో ఆలోచినాలి. దాంతో కులం కార్డు ట్యాగ్ గా ఉండడంతో తాము ఓడిపోయామని వారు భావిస్తే ఆశ్చర్యం ఏముంది.

మొత్తం 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలలో 50 కి పైగా రెడ్లు ఉంటే వారికి దక్కినవి నాలుగు మంత్రి పదవులు మాత్రమే. అంటే ఈ జస్ట్ టూ పెర్సెంట్ అన్న మాట. మరి వారి ఓట్ల శాతమే దీని కన్నా ఎక్కువగా ఉంది. దాని కంటే ముందు వారి పోలిటికల్ ఫోకస్. ఉమ్మడి ఏపీలో వారు ఎంతలా రాణించారో చూసుకుంటే అవగాహన చేసుకుంటే మాత్రం ఇపుడు వారికి దక్కిన చోటు ఇస్తున్న‌ ప్రాధ్యాన్యత కన్నీరు పెట్టించక మానదు అనే అంటున్నారు.

ఇక కేవలం కులం ఉంటే చాలు ఆరోపణలు ఏమి వచ్చినా పట్టించుకోకూడదు అని వైసీపీ పెద్దలు అనుకున్నారులా ఉంది. అందుకే కర్నూల్ నుంచి గుమ్మలూరి జయరాం మీద అవినీతి ఆరోపణలు వచ్చినా రెండు జిల్లాల‌లో ఆయన బోయ సామాజికవర్గం ఉంది కాబట్టి మళ్ళీ మంత్రిని చేశారు. అలాగే ఉషశ్రీ చరణ్ ఎపుడూ తన నియోజకవర్గం కల్యాణదుర్గంలో ఉండరు, ఆమె ఉండేది బెంగుళూరు అని లోకల్ వైసీపీ క్యాడర్ గగ్గోలు పెట్టినా ఆమెను మంత్రి పదవి వరించడానికి కారణం కురుబ సామాజికవర్గం కావడమే అంటున్నారు.

ఇలాంటి కులాల ఈక్వేషన్స్ చాలానే వేసుకుని మంత్రి పదవులు ఇచ్చారు అని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే ఎన్నికల క్యాబినేట్ గా చెప్పుకుంటున్న ఈ మంత్రి వర్గంలో చాలా మంది సమర్ధులు బయట ఉండిపోయారు. వారిలో అసంతృప్తి చాలానే ఉంది అంటున్నారు. టోటల్ గా ఈ లిస్ట్ ని చూస్తే ఒక్కటే చెప్పాలి అంటున్నారు. కులం గెలించి, కులం ఓడింది అని మాత్రమే.