Begin typing your search above and press return to search.

స్టేషన్ మాస్టర్ గా కొత్త పిల్లి!

By:  Tupaki Desk   |   27 Aug 2015 4:35 AM GMT
స్టేషన్ మాస్టర్ గా కొత్త పిల్లి!
X
ఇంట్లో దాచుకున్న పాలు దొంగచాటుగా తాగడం, అటుగా వచ్చిన ఎలుకల్ని తరమడం, కుక్క కనిపిస్తే పారిపోవడం... ఇది మనకు తెలిసిన పిల్లుల సంగతి. వీటిని చూసీ చూడనట్లు వదిలేసేవారు కొందరైతే... అక్కునచేర్చుకుని సాకేవారు మరికొందరు. కానీ పెంపుడు జంతువుగా, పాలుతాగేదిగా మాత్రమే మనకు తెలిసిన పిల్లి... జపాన్ లో మాత్రం ఒక ప్రభుత్వ అధికారి!

అవును ఇది నిజం. జపాన్ లోని ఒక రైల్ స్టేషన్ కు ఒక పిల్లి స్టేషన్ మాస్టార్ గా బాధ్యతలు నిర్వహిస్తుంటుంది. ఈ పిల్లి పేరు టామా! ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోయింది. నెత్తిన నల్ల టొపీ పెట్టుకుని విధిగా డ్యూటీ చేసే ఈ తెల్లపిల్లిని చూడటానికి పర్యాటకులు తండొపతండాలుగా వచ్చేవారు. అయితే తాజాగా ఈ పిల్లి మృతిచెందడంతో సందర్శకులు, స్టేషన్ సిబ్బంది విషాదంలో మునిగిపోయారు. ఈ పిల్లి చేసిన సేవలకు గానూ... ఆ స్టేషన్ పరిదిలో ఈ పిల్లికి ఒక విగ్రహం కూడా చేయించి పెట్టారు.

అయితే తాజాగా సందర్శకులకు, పర్యాటకులకు మరో గుడ్ న్యూస్ తెలిసింది. ఇప్పుడు మరో పిల్లి ఆ స్థానాన్ని భర్తీ చేయనుంది. ఈ కొత్త స్టేషన్ మాస్టార్ పేరు నిటామా! ఈ పిల్లి ఇప్పటికే శిక్షణ కూడా పూర్తిచేసుకుంది. దీంతో మరళా ఆ స్టేషన్ కు పూర్వవైభవం వచ్చిందని చెబుతున్నారు కొలీగ్స్!