Begin typing your search above and press return to search.

పిల్లికి సోకిన కరోనా వైరస్ !

By:  Tupaki Desk   |   28 March 2020 9:30 PM GMT
పిల్లికి సోకిన కరోనా వైరస్ !
X
కరోనా వైరస్ ..ఈ మహమ్మారి ప్రస్తుతం ప్రపంచాన్ని గజగజవణికిస్తుంది. చైనా లో మొదలైన ఈ కరోనా వైరస్ ఆ తరువాత ఆ దేశం ఈ దేశం అంటూ తేడా లేకుండా ..ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. అయితే ఈ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 27 వేల మందికి పైగా చనిపోయారు. అలాగే 607,310 మంది కరోనా భారిన పడ్డారు. ఇకపోతే ఇప్పటివరకు ఈ కరోనా వైరస్ మనుషులకి మాత్రమే వస్తుంది.

తాజాగా బెల్జియంలోని ఓ పెంపుడు పిల్లికి వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీని బట్టి పెంపుడు జంతువులకు వైరస్ వ్యాపిస్తుంది. హాంగ్ కాంగ్ లో కుక్కలకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే కుక్కల్లలో మాత్రం వైరస్ లక్షణాలు కనిపించలేదు. కానీ ఈ పిల్లిలో మాత్రం కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. పూర్తి వివరాలు చూస్తే .. ఆ పిల్లిని పెంచుకుంటున్న వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దాంతో ఆ పిల్లికి కూడా వైరస్ టెస్టు చేస్తే పాజిటివ్ అని వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో పిల్లిని 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచాలని వైద్యులు ఆదేశించారు.

ఆ పిల్లి శ్వాస కోశ, జీర్ణ సమస్యలతో బాధపడుతోందని బెల్జియం ఫుడ్‌ సేఫ్టీ ఏజెన్సీ ఏఎఫ్‌ ఎస్‌ సీఏ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ వైరస్ అనేది పెంపుడు జంతువుల నుంచి మనషులకు, ఇతర జంతువులకు వ్యాప్తి చేస్తుందనటానికి ఎటువంటి ఆధారాలు లేవని బెల్జియం అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎవరైనా పెంపుడు జంతువులను తాకేముందు, తాకిన తర్వాత చేతులను శుభ్రంగా కడుకోవటం మంచిది.