Begin typing your search above and press return to search.

చెన్నైని చైనా చేసేశారు

By:  Tupaki Desk   |   31 Oct 2016 9:10 AM GMT
చెన్నైని చైనా చేసేశారు
X
ఇదీఅదీ అని కాకుండా కనిపించిన ప్రతి జీవినీ తినేసేవారు ఎవరని అడిగితే ఠక్కున వినిపించే సమాధానం చైనా. అక్కడి ప్రజలు పాములు - తేళ్లు కూడా తినేస్తారు. కుక్కలు - పిల్లులు - ఎలుకలు - పాములు - పక్షులు - కప్పలు.. ఒకటేమిటి ''కాదేదీ తిండికనర్హం" అంటూ వారు కసకసా నమిలి మింగేస్తారు. ఇప్పుడు తమిళనాడు రాజధాని చెన్నైలోనూ కొందరు హోటల్ యజమానులు వినియోగదారులను మోసం చేస్తూ చైనా టైప్ ఫుడ్ పెట్టేస్తున్నారట.

నాన్ వెజ్ బిర్యానీల్లో పిల్లి మాంసం కలిపేస్తున్నారట. దీనికోసం - పిల్లుల్ని చంపి - వాటితో బిర్యానీ చేస్తున్నారు. ఎవరికీ తెలియకుండా ఎత్తుకొచ్చిన పిల్లులతో ఈ పని చేస్తున్నారు. ఇప్పటికే తమ పెంపుడు పిల్లులు కనిపించడం లేదంటూ చెన్నై పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి. నగరంలోని పల్లవరంలో జంతు సంరక్షణకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ వాలంటీర్లు - చెన్నై పోలీసులు సంయుక్తంగా జరిపిన అటాక్ తో ఈ దారుణం వెలుగు చూసింది. ఈ సందర్భంగా, బోనులో ఉంచిన పిల్లులను వారు విడిపించారు.

అయితే... ఇదేమీ కొత్త విషయం కాదని.. చెన్నైలో క్యాట్ బిర్యానీ ఎప్పటి నుంచో ఉందని చెబుతున్నారు కొందరు. పోలీసులకూ ఈ విషయం తెలుసని.. చూసీ చూడనట్లు ఉంటారని.. ఇప్పుడు ఫిర్యాదులు రావడంతో కొత్తగా తెలిసినట్లు నటిస్తున్నారని చెబుతున్నారు. మొత్తానికి చెన్నైని చైనాలా మార్చేస్తున్నారన్నమాట.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/