Begin typing your search above and press return to search.

అమెరికా లో ఆవుపేడ వ్యాపారం..అదిరి పోయే స్పంద‌న‌

By:  Tupaki Desk   |   19 Nov 2019 4:15 AM GMT
అమెరికా లో ఆవుపేడ వ్యాపారం..అదిరి పోయే స్పంద‌న‌
X
అవు పిడ‌క‌ల‌కు...హోళీ, సంక్రాంతి సహా పలు పండగల టైంలో వీటికి మంచి గిరాకీ ఉంటుంది. అయితే, స‌ర్వం ఆన్‌లైన్ అయిపోయిన ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో పిడ‌క‌లు కూడా నెట్లో కొనుక్కోవాల్సిన ప‌రిస్థితి. ఈ-కామర్స్ సైట్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో ఆవు పేడతో చేసిన పిడకలను అమ్మడం దీనికి నిద‌ర్శ‌నం. ఇవి చూసే మ‌నం నోరెల్ల‌బెట్టేశాం క‌దా? ఇప్పుడు సేమ్ టు సేమ్ ఆవు పేడతో చేసిన పిడకల్ని కలిపి అమెరికాలో అమ్ముతున్నారు. అమెరికాలోని కిరాణా స్టోర్స్‌ల‌లో పది పిడ‌క‌ల‌ను ప్యాక్ చేసి వీటి ధర 2.99 డాలర్లుగా పెట్టి అమ్ముతున్నారు. వీటికి ఆద‌ర‌ణ కూడా బాగానే ఉంద‌ట‌.


న్యూజెర్సీలోని ఎడిసన్‌లో ఉన్న ఓ గ్రాసరీ స్టోర్‌లో వీటిని అమ్ముతున్నట్లు సమర్ హలామ్కర్ అనే ఎన్నారై ట్వీట్ చేశాడు. తమ బంధువు కజిన్ వాటి ఫొటోను తనకు పంపాడని తెలిపాడు. అయితే ఆ ప్యాకెట్ చూసిన సమర్‌కు ఓ వింత డౌట్ వచ్చింది. దేశీ ఆవు పేడతో చేసిన పిడకలనే ఇండియా నుంచి దిగుమతి చేశారా? లేక అమెరికా ఆవులతో చేసినవా? అంటూ ట్విట్టర్లో అడిగాడు. దీనిపై చాలా మంది దేశీ అవు పిడకలే అంటూ కామెంట్లు చేశారు. ఓ నెటిజన్ మాత్రం టేస్ట్ చేసి చూడు అంటూ సెటైర్ వేశాడు. ఎందుకైనా మంచిద‌ని ఈ ప్యాకెట్‌పై ఓ సూచ‌న కూడా చేశారు. ‘కౌ డంగ్ కేక్స్.. తినడానికి కాదు. ఇవి పండుగలు, సంప్రదాయ అవసరాల్లో వాడుకునేందుకు’ అని తెలిపారు. అంతే కాదు ఎన్నారైల కు డౌట్ రావచ్చని ఇండియా నుంచి వచ్చిన ప్రాడక్ట్ అని తెలుపుతూ “Product of India” అని దానిపై ప్రింట్ చేసి సందేహానికి ముందే క్లారిటి ఇచ్చారు.