Begin typing your search above and press return to search.

లండన్ లో కొట్టేసి.. పాక్ లో పట్టేశారు.. ఆ రెండున్నర కోట్ల బెంట్లీ కారు కథ?

By:  Tupaki Desk   |   6 Sep 2022 2:30 AM GMT
లండన్ లో కొట్టేసి.. పాక్ లో పట్టేశారు.. ఆ రెండున్నర కోట్ల బెంట్లీ కారు కథ?
X
అది బ్రిటన్ దేశంలోని అతిపెద్ద నగరం ‘లండన్’. అక్కడ కోట్లు విలువ చేసే కారు మాయమైంది. అది పాకిస్తాన్ లో ప్రత్యక్షమైంది. భారత కరెన్సీలో దాదాపు 2.39 కోట్లు విలువ చేసే విలాసవంతమైన కారును లండన్ నుంచి పాకిస్తాన్ కు ఎలా తెచ్చారన్నదే అసలు చిక్కుముడి. ఈ ఖరీదైన ఫారెన్ కారును దొంగిలించారని తేలింది.

పాకిస్తాన్ లోని కరాచీలో ఉన్న ఓ సంపన్నుడి ఇంట్లో ఈ ఖరీదైన కారును గుర్తించారు. దాని హై టెక్నాలజీ వల్ల ఎక్కడుందో కనిపెట్టారు. కొన్ని వారాల క్రితం బెంట్లీ కారు లండన్ నుంచి మాయమైంది. చివరకు అది పాకిస్తాన్ కు అక్రమ మార్గంలో చేరి ఓ సంపన్నుడి చేతిలోకి వెళ్లిపోయింది. కారును దొంగిలించడంలో ఉపయోగించిన తెలివిని దుండగులు.. దాన్ని టాక్ చేసే వ్యవస్థను గుర్తించడంలో విఫలమయ్యారు.

బెంట్లీ కారులో ఉండే అత్యాధునిక ట్రాకింగ్ వ్యవస్థను ఆఫ్ చేయకపోవడంతో లండన్ లోని నేర విభాగం వాహనం ఉన్న ప్రదేశాన్ని సరిగ్గా గుర్తించగలిగింది. కరాచీలోని ‘కలెక్టరేట్ ఆఫ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్’కు సమాచారం ఇచ్చింది.

లండన్ నుంచి వచ్చిన వివరాలతో పాకిస్తాన్ అధికారులు కరాచీలోని సంపన్నులు నివాసం ఉంటే డీహెచ్.ఏ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. చివరకు ఓ ఇంట్లో ఆ కారును గుర్తించారు. అప్పటికే దాన్ని పాకిస్తాన్ రిజిస్ట్రేషన్ నంబర్ ను కూడా అమర్చారు. తర్వాత అది కూడా నకిలీదని తేలింది.

ఛాసిస్ నంబర్ మాత్రం లండన్ అధఇకారులు ఇచ్చిన సంఖ్యతో పోలి ఉంది. పైగా యజమాని సరైన పత్రాలు కూడా చూపించలేకపోవడంతో కారును స్వాదీనం చేసుకున్నారు.

కారు కొన్న వ్యక్తితోపాటు దాన్ని అమ్మిన మధ్యవర్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఓ ఐరోపా దేశఆనికి చెందిన దౌత్యాధికారి పత్రాలు ఉపయోగించుకొని కారును పాకిస్తాన్ తరలించినట్టు విచారణలో తేలింది. ఈ కారును అక్రమ మార్గంలో తరలించడం వల్ల పాకిస్తాన్ కోట్లాది రూపాయల పన్నును కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.