Begin typing your search above and press return to search.
కరోనా నెగటివ్ వచ్చినా ఏడాది పాటు తస్మాత్ జాగ్రత్త
By: Tupaki Desk | 28 Jun 2021 8:30 AM GMTకరోనా బారిన పడ్డ వారు తీవ్ర జ్వరం తో పాటు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందరు ఒకే రకమైన సమస్యలు కాకుండా ఒకొక్కరు ఒక్కో సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. కరోనా ను జయించిన తర్వాత కొందరు పూర్తిగా కోలుకుంటే మరి కొందరు మాత్రం ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కరోనా బారిన పడ్డ వారిలో ఎక్కువ శాతం మంది నెగటివ్ వచ్చిన తర్వాత నార్మల్ అవుతున్నారు. కాని కొందరు మాత్రం దానికి సంబంధించిన పరిణామాలతో బాధపడుతూ ఉన్నారు. ఇమ్యూనిటీ పవర్ తగ్గడం నుండి మొదలుకుని వాసన రుచి తిరిగి రాకపోవడం వరకు అనేక సమస్యలు కరోనా తగ్గినా కంటిన్యూ అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇటీవల ప్రాన్స్ శాస్త్రవేత్తల పరిశోదనలో ప్రకారం ఎవరిలో అయితే కరోనా నెగటివ్ వచ్చినా రుచి మరియు వాసన తెలియడం లేదో వారికి కనీసం ఏడాది కాలం తర్వాత తిరిగి అవి వచ్చే అవకాశం ఉందట. కరోనా కారణంగా వాసన మరియు రుచిని కోల్పోయిన మొత్తం 97 మందిపై వారు ప్రయోగాలు చేయగా 51 మంది లో నాలుగు నెలల్లో వాసన మరియు రుచి లక్షణాలు తిరిగి వచ్చాయి. ఆ తర్వాత కొందరికి ఆరు నెలలకు వచ్చాయి. అలా మొత్తం 97 మందికి కూడా రుచి మరియు వాసన అనేది ఏడాది లోపు వచ్చినట్లుగా వారు చెబుతున్నారు.
రుచి మరియు వాసన తెలియక పోయినా ఆందోళన అక్కర్లేదు అని ఏడాది వరకు ఖచ్చితంగా వస్తుందని ప్రాన్స్ శాస్త్రవేత్తల బృందం తెలియజేయడం జరిగింది. మరో వైపు నిపుణులు కరోనా నెగటివ్ వచ్చిన తర్వాత కూడా కనీసం ఏడాది పాటు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కరోనా వల్ల ఇమ్యూనిటీ పవర్ చాలా తగ్గే అవకాశం ఉంది. తద్వార ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తద్వారా ప్రాణాలకే అపాయం ఉంటుందని కూడా నిపుణులు చెబుతున్నారు.
కరోనా నుండి కోలుకున్న తర్వాత మూడు నాలుగు నెలల్లో అనారోగ్య సమస్యలు అంటూ ఆసుపత్రుల చుట్టు తిరిగే వారు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నమోదు అయిన కేసుల సరాసరిగా చూస్తే దాదాపుగా 40 శాతం మందికి కరోనా నెగటివ్ వచ్చిన తర్వాత కూడా మూడు నెలల కాలంలో ఏదో ఒక అనారోగ్య సమస్య తలెత్తినట్లుగా గుర్తించారు. ఇక కొందరు ఏడాది కాలం పాటు ఏదో ఒక సమస్యతో బాధపడ్డారు. అతి కొద్ది మంది మాత్రం కరోనా నెగటివ్ అయిన కొన్ని నెలల తర్వాత మృతి చెందిన దాఖలాలు ఉన్నాయి. కనుక కరోనా నుండి కోలుకున్నాం కదా అని ఆరోగ్యం విషయంలో అశ్రద్ద కనబర్చితే ఖచ్చితంగా ప్రతిఫలం తీవ్రంగా ఉంటుందని.. అందుకే ఏడాది పాటు తస్మాత్ జాగ్రత్త అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.