Begin typing your search above and press return to search.

బోగు స్కామ్ నిందుతులకి పట్టపగలే చుక్కలు చూపిస్తున్న సిబిఐ

By:  Tupaki Desk   |   28 Nov 2020 3:50 PM GMT
బోగు స్కామ్ నిందుతులకి పట్టపగలే చుక్కలు చూపిస్తున్న సిబిఐ
X
అక్రమ మైనింగ్, కోల్ ఫీల్డ్ లిమిటెడ్ కేసుకు సంబంధించి నాలుగు రాష్ట్రాల్లో సీబీఐ అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి షాక్ ఇచ్చారు. ఈ బోగ్గు స్కామ్ అక్రమాల కేసుకు సంబంధించి ఇటీవల సీబీఐ అధికారులు రంగంలోకి దిగి లోతుగా విచారణ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ లో బోగ్గు స్కామ్ జరిగినా బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ తో పాటు వారం ముందు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన బీహార్ లో కూడా సీబీఐ దాడులు జరిగాయి. నాలుగు రాష్ట్రాల్లో 45 ప్రాంతాల్లో ఏకకాలంలో సీబీఐ దాడులు చడిచప్పుడు లేకుండా జరగడంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లు, వారి అనుచరులు దెబ్బకి షాక్ నుండి కోలుకోలేకపోతున్నారు.

ఈ కేసు కి సంబంధించి శుక్రవారం సీబీఐ అధికారులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.ఇక, శనివారం నాలుగు రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు చెయ్యడంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు ఒక్కసారిగా షాక్ లోకి వెళ్లిపోయారు. ఎఫ్ ఐ ఆర్ నమోదు చెయ్యడం, వెంటనే నోటీసులు ఇవ్వడం, ఏకకాలంలో సీబీఐ సోదాలు జరగడంతో ఇసీఎల్ కేసులోని నిందితులకి మైండ్ బ్లాక్ అయింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన ప్రముఖ వ్యక్తి అనూప్ మాఝి ఈ బోగ్గు స్కామ్ కేసులో ప్రముఖ నిందితుడు, కింగ్ పిన్ అని సీబీఐ అధికారులు అంటున్నారు. శనివారం సీబీఐ అధికారులు అనూప్ మాఝి నివాసంతో పాటు ఆయన కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. అనూప్ సన్నిహితులు, అనుచరుల ఇళ్లలో కూడా సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు.

ఇసీఎల్ వ్యవస్థాపకులు ఇద్దరు, ఇద్దరు ప్రముఖ అధికారులు, ఒక భద్రతా అధికారితో పాటు ప్రైవేట్ వ్యక్తి అయిన అనూప్ మాఝి ఈ బోగ్గు స్కామ్ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అమిత్ షా పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్లిన టైమ్ లో సీబీఐ అధికారులు నోటీసులు ఇవ్వడం, వెంటనే దాడులు చెయ్యడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉలిక్కిపడింది. బోగ్గు స్కామ్ కేసులో మా మీద కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలుచేస్తున్న సంగతి తెలిసిందే.