Begin typing your search above and press return to search.
పంచ్ ప్రభాకర్ కు సీబీఐ ‘అరెస్టు పంచ్’
By: Tupaki Desk | 26 Nov 2021 6:31 AM GMTహద్దు అదుపు లేకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడే తీరు ఈ మధ్యన ఎక్కువైంది. ఎవరి మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయాలన్న విచక్షణ తగ్గి.. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను దారుణంగా దుర్వినియోగం చేస్తున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించి.. వివాదాస్పదంగా మారారు పంచ్ ప్రభాకర్ అలియాస్ పి. ప్రభాకర్ రెడ్డి. అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న ఆయన.. దేశ న్యాయమూర్తుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం.. దారుణ ఆరోపణలతో వివాదాస్పదంగా మారటం తెలిసిందే.
ఆయన చేసిన వ్యాఖ్యలపై న్యాయస్థానాలు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేయటం తెలిసిందే. న్యాయమూర్తులను దూషించిన ఉదంతంలో కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సీబీఐ.. ఆయనకు ఈ నెల ఒకటిన లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లుగా పేర్కొన్నారు. న్యాయవ్యవస్థను.. హైకోర్టు న్యాయమూర్తులపై ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను సంచలనంగా మారాయి. తాము అభిమానించే వారికి కోసం ఏమైనా చేసే మైండ్ సెట్ ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. అలాంటి తీరునే ప్రదర్శించిన పంచ్ ప్రభాకర్ ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమవుతుందని చెబుతున్ానరు.
సోషల్ మీడియాలో ఆయన పోస్టు చేసిన వాటిపై పెట్టిన కేసుకు సంబంధించి సీబీఐ తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. దీన్ని సీబీఐ డైరెక్టర్ జైస్వాల్ హైకోర్టులో దాఖలు చేశారు. అమెరికాలో నివాసం ఉండే ప్రభాకర్ కు సీబీఐ బ్లూ నోటీసుల్ని జారీ చేసింది. నవంబరు ఎనిమిదిన అరెస్టు చేసేందుకు వారెంట్ తీసుకున్నారు కూడా. అనంతరం ఇంటర్ పోల్ కు సమాచారం ఇచ్చి ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు.
ఈ కేసుకు సంబంధించి అందరిని పిలిచి ప్రశ్నిస్తున్న సీబీఐ.. న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదంతానికి సంబంధించిన కేసులో పంచ్ ప్రభాకర్ ను 17వ నిందితుడిగా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అఫిడవిట్ ను ఇప్పటికే దాఖలు చేశారు. ఇక.. జడ్జిలపై పోస్టులు తొలగించటంపై ఈ నెల 15న యూట్యూబ్ ప్రతినిధులతో మాట్లాడినట్లుగా సీబీఐ పేర్కొంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్ని చూసినప్పుడు త్వరలోనే పంచ్ ప్రభాకర్ ను అరెస్టు చేసి.. భారత్ కు తీసుకురావటం ఖాయమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.