Begin typing your search above and press return to search.
ఆ జీఎస్టీ కమిషనర్ అరెస్ట్!
By: Tupaki Desk | 3 Feb 2018 9:50 AM GMTపన్ను ఎగవేతకు చెక్ పెట్టటం.. పన్నుల విధానాన్ని వీలైనంత సరళతరం చేసేందుకు వీలుగా తీసుకొచ్చిందే జీఎస్టీ. గూడ్స్ అండ్ సర్వీసెస్ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన తర్వాత కూడా దీన్లో ఉండే లొసుగుల్ని ఆధారంగా చేసుకొని కోట్లాది రూపాయిల్ని వెనకేసుకునే ఉన్నత ఉద్యోగులు ఉన్నారు. అలాంటి వారి లీలలు తాజాగా బద్ధలయ్యాయి.
కేంద్రంలోని మోడీ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా స్టార్ట్ చేసిన జీఎస్టీ విధానం సైతం నెమ్మదినెమ్మదిగా అవినీతిలోకి కూరుకుపోతోంది. తాజాగా కాన్పూర్ జీఎస్టీ కమిషనర్ సన్సార్ సింగ్ ను అవినీతి కేసులో భాగంగా అరస్ట్ చేశారు.
జీఎస్టీ కమిషనర్ తో పాటు.. అదే శాఖకు చెందిన ఇద్దరు సూపరిండెంట్లు.. ఒక ఉద్యోగితో పాటు ఐదుగురు ప్రైవేటు ఉద్యోగుల్ని సీబీఐ అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఐపీసీ 120 (బి).. పీసీ యాక్ట్ సెక్షన్ 7.. 11.. 12 కింద కేసులు నమోదు చేశారు.
హవాలా చానల్స్ ద్వారా వ్యాపారస్తుల నుంచి ప్రతి నెలవారీగా.. వారం వారీగా అంచనాలు వేసి మరీ లంచాలు తీసుకునే వారని తేల్చారు. శుక్రవారం రాత్రి రూ.1.5లక్షల మొత్తాన్ని లంచంగా తీసుకుంటూ పట్టుబడ్డారు. అవినీతి ఆరోపణల విషయంలో సింగ్ సతీమణిపై అధికారులు ఎప్ ఐఆర్ నమోదు చేశారు. అయితే.. ఆమెను ఇంకా అరెస్ట్ చేయలేదు. 1986 బ్యాచ్ కు చెందిన సింగ్ కాన్పూర్ జీఎస్టీ కమిషనర్ గా నియమించారు. అనూహ్యంగా అవినీతి ఆరోపణలతో అరెస్ట్ కావటంతో.. జీఎస్టీ అమల్లో లోటుపాట్లకు ఏ మాత్రం కొదవ లేదన్న విషయం తాజాగా ఫ్రూవ్ అయ్యిందని చెప్పాలి. మరి.. దేశ వ్యాప్తంగా మెరుపు వేగంతో ఒక్కసారి కానీ చెక్ చేస్తే మరిన్ని భారీ చేపల్ని పట్టుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.