Begin typing your search above and press return to search.
కటకటాల్లో చందా కొచ్చార్.. ఊహించి కూడా ఉండరు..!
By: Tupaki Desk | 27 Dec 2022 2:30 AM GMTఒకప్పుడు మ్యాగజీన్ కవర్లపై మెరిసిన చందాకొచ్చార్ ఇప్పుడు కటకటాల్లోకి ఊచలు లెక్క పెడుతున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా బ్యాంకింగ్ రంగాన్ని ఒకప్పుడు శాసించిన ఆమె అవినీతి ఆరోపణలతో పతనావస్థకు పడిపోయారు. తీగలాగితే డొంక కదిలిన చందంగా చందాకొచ్చార్ అవినీతి బాగోతం బయటపడింది. కాస్త తెలివి తేటలు ఉంటే బ్యాంకింగ్ వ్యవస్థను అడ్డంగా వాడుకోవచ్చని చందాకొచ్చర్ ఊదాంతం అందరికీ తెలిసేలా చేసింది.
ఐసీఐసీఐ బ్యాంక్ లో మేనేజ్మెంట్ ట్రైనీగా 1984లో చేరిన చందా కొచ్చర్ అతి తక్కువ సమయంలో ఆ బ్యాంక్ సీఈవోగా ఎదిగారు. ట్రైనీ నుంచి ఆమె ఎదిగిన తీరు తీరు అమోఘం. ఈ క్రమంలోనే ఆమె 2009 మేలో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో.. ఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఆమె బాధ్యతలు తీసుకున్న తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ అద్భుతమైన విజయాలు సాధించింది.
ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రైవేట్ బ్యాంక్ గట్టి పోటీ ఇవ్వగలవని చందకొచ్చార్ నిరూపించారు. బ్యాంకింగ్ రంగంలో ఆమె చేసిన కృషికి ఫలితంగా కేంద్రం ఆమెకు 2011లో పద్మ భూషణ్ పురస్కారం అందించింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచంలోని వంద మంది అత్యంత శక్తి వంతమైన మహిళల జాబితాలో చందాకొచ్చర్ కు చోటు కల్పించింది.
అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే మరోవైపు ఆమెపై అవినీతి మరకలు అంటున్నాయి. క్విడ్ ప్రోకో ద్వారా ఆమె భారీ కుంభకోణానికి పాల్పడ్డారనే విషయం బయటికి రావడానికి చాలా సమయం పట్టింది. వేణుగోపాల్ దూత్ కి చెందిన వీడియోకాన్ గ్రూప్ కు ఇచ్చి 3వేల రుణాల విషయంలో అవకతవకలు జరిగాయంటూ ఆమెను సీబీఐ పోలీసులు అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
2010లో ఐసీఐసీఐ బ్యాంక్ ఎస్సాఆర్ స్టీల్ కి 530 మిలియన్ డాలర్లు.. ఎస్సార్ ఆయిల్ కి 350 మిలియన్ల డాలర్ల రుణాన్ని మంజూరు చేసింది. ఈ రెండు కంపెనీలకు రుణాలిచ్చాక లంచాల రూపంలో చందా కొచ్చర్ భర్త దీపా కొచ్చర్ కంపెనీలోకి ఆ సంస్థలు పెట్టుబడులు వెళ్లాయి. రవి రూయా అల్లుడు నిషాంత్ కనోడియాకు చెందిన ఫస్ట్ హ్యాండ్ హోల్డింగ్స్ నాలుగు విడతలుగా న్యూ పవర్ లో 325 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.
శశి రుయా అల్లుడు అనిరుధ్ భువాల్కాకు చెందిన ఏ1 మోటార్స్ అనే సంస్థ ఏంఎండబ్యూ అనే మరో సంస్థ తో న్యూ పవర్ టెక్నాలజీస్ ను కొనుగోలు చేసిందనే అనుమానం అరవింద్ గుప్తా అనే ఇన్వెస్టర్.. సామాజిక కార్యకర్తకు వచ్చింది. అయితే దీని విలువ ఎంతన్నది అప్పుడు బయటికి రాలేదు. అడిగినంత అప్పు ఇచ్చినందుకు ప్రతిఫలంగా న్యూ పవర్ కు పెట్టుబడులు వెళ్లాయి. ఈ వ్యవహారమంతా క్విడ్ ప్రోకో అని రిజిస్టర్ ఆఫీస్ కంపెనీస్ నుంచి సేకరించిన సమాచారం తన వద్ద ఉందని అరవింద్ గుప్తా సంచలన ఆరోపణలు చేశారు.
ఈ ఆరోపణలు కొనసాగుతుండగానే చందా కొచ్చర్ వీడియోకాన్ కు 3వేల కోట్లను అప్పుగా ఇచ్చిన కేసులో ముడుపులు తీసుకున్న వ్యవహారం బయటపడింది. తీగలాగితే డొంక కదలిన చందంగా వీడియోకాన్ తోపాటు ఎఎస్సార్ గ్రూప్ వ్యవహరం సైతం బయటికి వచ్చింది. ఈ వ్యవహారంపై 2016 అరవింద్ గుప్తా అనుమానాలు వ్యక్తం ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. ఈ లేఖతో ఆర్బీఐ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది.
ఈ క్రమంలోనే ఆమె తన సీఈవో.. ఎండీ పదవీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం కాలంలో చందా కొచ్చర్ బ్యాంక్ కోడ్ ను ఉల్లంఘించినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ దర్యాప్తులో వెల్లడైంది. ఆ తర్వాత సీబీఐ లుక్ అవుట్ నోటీస్ జారీ చేసింది. 2020 సెప్టెంబర్ లో మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఆమెను అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆమె బెయిల్ పై విడుదలయ్యారు. 2022 మే లో చందా కొచ్చర్ పై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేయగా.. డిసెంబర్ 23న ఆమెను అరెస్టు చేసింది. డిసెంబర్ 26 వరకు మూడు రోజులు పాటు సీబీఐ ఆమెను కస్టడీలో ఉన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.