Begin typing your search above and press return to search.

కవితకు సీబీఐ 50 ప్రశ్నలు.. సమాధానాలు ఎన్నో తెలుసా?

By:  Tupaki Desk   |   12 Dec 2022 10:30 AM GMT
కవితకు సీబీఐ 50 ప్రశ్నలు.. సమాధానాలు ఎన్నో తెలుసా?
X
దాదాపు ఏడున్నర గంటలపాటు ఎమ్మెల్సీ కవితను విచారించింది సీబీఐ బృందం. ఉత్తరప్రత్యత్తరాల తర్వాత వీరిద్దరి భేటి జరిగింది. నిన్న కవిత ఇంటికి వచ్చిన సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. అనంతరం మరో నోటీసు అందించి షాక్ ఇచ్చారు. ఇంతకీ అన్ని గంటలు కవితను ఏం విచారించారన్నది హాట్ టాపిక్ గా మారింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయంపైనే ఈ ఏడున్నర గంటలు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. నిందితురాలిగా కాకుండా సాక్షిగా విచారిస్తున్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా ఈ విచారణపై కవిత న్యాయవాది.. ఆమెతో పాటు ఉన్న వ్యక్తి మాట్లాడారు. కవితను ఆమె న్యాయవాది సమక్షంలోనే సీబీఐ డీఐజీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

దాదాపు 50 ప్రశ్నల వరకూ కవితకు సంధిస్తే.. కవిత మాత్రం నాలుగైదింటికి మాత్రమే సమధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎక్కువ ప్రశ్నలకు తనకు తెలియదు అన్న జవాబే ఇచ్చినట్టు సమాచారం. సీబీఐ ప్రశ్నలు పూర్తిగా సునీల్ అరోరా రిమాండ్ రిపోర్ట్ చుట్టూనే వేసినట్టు తెలిసింది. కవిత వాడిన 10 ఐఫోన్ల అంశంపైనే ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. అన్ని ఫోన్లు ఎందుకు వాడారు. ఎందుకు ధ్వంసం చేశారు? లాంటి ప్రశ్నలతోపాటు అమిత్ అరోరా తెలుసా? ఎలా పరిచయం? ఆయనతో మాట్లాడారా? శరత్ చంద్రారెడ్డి , మాగుంట శ్రీనివాసులు రెడ్డి పరిచయం ఎలా అంటూ వరుస ప్రశ్నలు వేసినట్టుగా తెలుస్తోంది.

కవిత ఎవరెవరితో మాట్లాడారాన్న ఆమె సెల్ ఫోన్ కాల్ డేటాను చూపిస్తూ ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. చాలా వరకూ అడిగిన ప్రశ్నలకు మరికొన్ని ప్రశ్నలు కలిపి అడిగారనట.. కవితకు సీబీఐ అధికారులు చూపించిన కాల్ డేటా మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కాం సమయంలోనే జరిగినట్టుగా చెబుతున్నారు.

సీబీఐ ప్రశ్నలు మొత్తం సూటిగా ఉండగా.. ప్రతి ప్రశ్నకు సమాచారాన్ని చూపించినట్టు సమాచారం. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లిన ట్రావెల్ హిస్టరీని సీబీఐ అధికారులు కవితను అడిగినట్టు తెలుస్తోంది. అవసరమైతే మరోసారి ప్రశ్నించాల్సి ఉంటుందని కవితకు నోటీసులు ఇచ్చి వెళ్లారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.