Begin typing your search above and press return to search.
రాయపాటి కేసు లో స్పీడ్ పెంచిన సిబిఐ ..!
By: Tupaki Desk | 3 Jan 2020 6:53 AM GMTఆంధప్రదేశ్ రాజకీయాలలో కీలక నేత , తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ అయినటువంటి రాయపాటి సాంబశివ రావు పై సిబిఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అక్రమంగా విదేశాలకి నిధులు మళ్లించారని సిబిఐ ఆయన పై కేసు నమోదు చేసింది. దేశీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను.. ఇతర ఖాతాల ద్వారా విదేశాలకు మళ్లించారని సీబీఐ అనుమానిస్తోంది. దీనితో ఈ కేసుపై సిబిఐ విచారణ వేగవంతం చేసింది. రాయపాటి కి చెందిన ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఆర్థిక లావా దేవీల పై అనుమానం వ్యక్తం చేస్తున్న సిబిఐ ఈ సంస్థ ఖాతాలపై ప్రధానంగా దృష్టి సారించింది.
ఇతర ఖాతాలకు నిధులు మళ్లించిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యం లో 2013 నుంచి 2015 వరకు జరిగిన బ్యాంకు లావాదేవీల వివరాలు సేకరించే పని లో సిబిఐ బిజీగా ఉంది. ఎంత డబ్బు రుణాల రూపంలో వచ్చింది.. వాటిని ఎలా ఖర్చు పెట్టారు? ఏయే ఖాతాలకు ఎంతెంత మళ్లించారు? అలా మళ్లించిన వాటిలో విదేశీ ఖాతాలు కూడా ఉన్నాయా? తదితర విషయాల గురించి పూర్తి సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నారు. ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ సంస్థ సకాలంలో డబ్బులు చెల్లించడం లేదని, 2015లోనే బ్యాంకుల కన్సార్షియం సదరు సంస్థ ఖాతాను ఎన్ పీఏ గా ప్రకటించింది. దీంతో ఇతర ఖాతాల ద్వారా లావాదేవీలు జరిపినట్లు ఆరోపణ లున్నాయి.
ఈ వ్యవహారం మొత్తం ... రూ.264 కోట్ల నిధుల మళ్లింపుపై యూనియన్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదుపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్న క్రమంలో ఈ విషయాలన్నీ వెలుగు లోకి వస్తున్నాయి. ట్రాన్స్ట్రాయ్ ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగాలేని సమయంలో ఆ సంస్థకు పోలవరం పనులు కట్టబెట్టడంపై అప్పట్లో పెద్ద దుమారమే రేగిన విషయం తెలిసిందే. అలాగే ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఇచ్చిన విరాళాలపైనా సీబీఐ దృష్టి పెట్టింది. 2012 నవంబర్ 17న తిరుచానూరు పద్మావతి అమ్మవారికి రూ.4.33 కోట్ల విలువైన బంగారు చీరను కానుకగా సమర్పించారు. ఆ బంగారు చీర తయారీకి ఎనిమిది కిలోల బంగారం, 879.438 గ్రాముల వజ్రాలు, పగడాలు ఉపయోగించడం గమనార్హం. 2013 డిసెంబర్ 5న తిరుమల శ్రీవారి నిత్యాన్నదానం ట్రస్టుకు రూ.3.42 కోట్లు విరాళం గా ఇచ్చారు. ఈ నిధులు వారికి ఎక్కడ నుంచి వచ్చాయనే విషయంపై కూడా సీబీఐ ఎంక్వయిరీ చేస్తుంది.