Begin typing your search above and press return to search.
ఈసారి యూకో బ్యాంక్ వంతు..621కోట్లు ఫట్!
By: Tupaki Desk | 15 April 2018 5:04 AM GMTబ్యాంకుల్ని వాడేసుకొని వేలాది కోట్ల రూపాయిల్ని దారి మళ్లించిన ఘనకార్యాలు ఒకటికొకటిగా బయటకు వస్తున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా.. మూడో కంటికి తెలీయని రీతిలో బ్యాంకులకు బ్యాండ్ వేస్తున్న వైనాలు ఇప్పటికే బయటకు వచ్చి సంచలనం సృష్టించాయి. ఇప్పుడా వరసలో చేరింది యూకో బ్యాంక్. ఈ బ్యాంక్ కు రూ.621 కోట్లు టోపీ పెట్టేసిన వైనం కొత్త కలకలాన్ని రేపుతోంది. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న ఈ మోసాలు మరిన్ని బయటకు వస్తాయి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
సంచలనంగా మారిన యూకో బ్యాంక్ స్కాం లోతుల్లోకి వెళ్లి చూస్తే.. వందల కోట్ల రూపాయిల మోసానికి సంబంధించిన మాస్టర్ మైండ్ ఆ బ్యాంక్ మాజీ సీఎండీయేనని సీబీఐ దర్యాప్తు స్పష్టం చేస్తోంది. బ్యాంకు రుణాల పేరుతో సొంత బ్యాంకుకు రూ.621 కోట్ల మేర టోపీ పెట్టేసిన వైనం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. తాజాగా సంస్థ మాజీ సీఎండీ అరుణ్ కౌల్ పై కేసు బుక్ చేశారు.
2010 నుంచి 2015 వరకు బ్యాంక్ సీఎండీగా వ్యవహరించిన కౌల్.. పక్కా వ్యూహంతో పెద్ద ఎత్తున నిదుల్ని పక్కదారి పట్టించినట్లుగా భావిస్తున్నారు. రక్షకుడిగా వ్యవహరించాల్సిన స్థానే.. బ్యాంక్ కు వందలాది కోట్లు నష్టపోయేలా చేసిన వైనం బయటకు రావటంతో ఆ బ్యాంక్ వర్గాలు ముక్కున వేలేసుకుంటున్నాయి.
చార్టెడ్ అకౌంట్ల సాయంతో దొంగపత్రాలు సృష్టించి.. అబద్ధపు మాటలతో వందలాది కోట్లు పక్కదారి పట్టించిన వైనం ఇప్పుడు బ్యాంకింగ్ వర్గాల్లో భయాందోళనలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి. యూకో బ్యాంక్ వద్ద నుంచి దపాల వారీగా ఇరా ఇంజినీరింగ్ ఇన్ ఫ్రా ఇండియా లిమిటెడ్ (ఈఈఐఎల్) రూ650 కోట్లు రుణంగా తీసుకుంది.
ఇంత భారీ మొత్తం దేని కోసం రుణం తీసుకున్నది చూస్తే.. తమ సంస్థ (ఈఈఐఎల్) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. పంజాబ్ నేషనల్ బ్యాంకు.. ఐఎఫ్‌సీఐల వద్ద అధిక వడ్డీకి రుణాలు తీసుకున్నామని.. యూకో బ్యాంక్ నుంచి తీసుకునే రుణంతో పాత రుణాల్ని కట్టేయనున్నట్లుగా చెప్పి రుణాలు మంజూరు చేయించుకున్నారు. ఆరు వందల కోట్లకు పైగా తీసుకున్న రుణంలో కేవలం రూ.59 లక్షల్ని మాత్రమే బ్యాంక్ రుణం తీర్చారు. మిగిలిన మొత్తాన్ని పక్కాదారి పట్టించేశారు.
ఇదిలా ఉంటే యూకో బ్యాంక్ ప్రకటించిన నిరర్థక ఆస్తులు 2017 డిసెంబరు నాటికి రూ.7373.88 కోట్లు అని తేల్చగా.. ఇందులో మాజీ సీఎండీ బురుడీ కొట్టించిన రూ.650 కోట్ల రుణం ఉంది. దీనిపై విచారణ షురూ చేసిన సీబీఐ మాజీ సీఎండీ కౌల్ తో పాటు.. ఈఈఐఎల్ సీఎండీ హేమ్ సింగ్.. మరో ఇద్దరు చార్టెడ్ అకౌంటెట్లతో పాటు పవన్ బన్సాల్ (మెస్సర్స్ ఆల్దియస్ ఫిన్ సెర్వ్ ప్రైవేట్ లిమిటెడ్) లపై కేసు నమోదు చేసింది. కేసులదేముంది.. ఇంత భారీ మోసం బయటకొచ్చినప్పుడు ఇలాంటివి కామనేగా!