Begin typing your search above and press return to search.
మొన్న సుజనా - నేడు నామా
By: Tupaki Desk | 14 March 2019 7:43 AM GMTటీడీపీ ఎంపీలంగా బాగా సౌండ్ పార్టీలని అందరికి తెలిసింది. ఎంపీలుగా ఉండి వీళ్లు ఏం చేసింది లేకపోయినా.. ఇతర రాష్ట్రాల్లో కాంట్రాక్టులు మాత్రం బాగా పొందారు. కొంతమంది డొల్ల కంపెనీలు పెట్టి బ్యాంకుల్ని మోసం చేస్తే.. ఇంకొంతమంది తీసుకున్న కాంట్రాక్ట్ ని పక్కనపడేసి పనులు చేయకుండా చోద్యం చూస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు మధుకాన్ అనే ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ ఏపీ - తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాల్లో నేషనల్ హైవేలే నిర్మించింది. ఇంకా నిర్మిస్తూనే ఉంది. ఇందులో భాగంగా.. మధుకాన్ కంపెనీకి జార్ఖండ్ రాష్ట్రంలో 163 కిలోమీటర్ల మేర రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించే ప్రాజెక్టు వచ్చింది. ఈ ప్రాజెక్టు కన్సెషన్ పీరియడ్ 15 సంవత్సరాలు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,655 కోట్లు. ఇందులో రూ.1,151.60 కోట్ల రుణం ఇచ్చేందుకు కెనరా బ్యాంకు నేతృత్వంలోని 15 బ్యాంకుల కన్సార్షియం ముందుకు వచ్చింది. ప్రమోటర్లు తమ వాటాగా రూ.503.60 కోట్లు సమకూర్చాలి. 2012 డిసెంబరులో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. కానీ ఇంతవరకు ప్రాజెక్టు పూర్తి కాలేదు. రోడ్డు విస్తరణ పనులు ఎంతకీ పూర్తి కాకపోవడంతో జార్ఖండ్ హైకోర్టు జోక్యం చేసుకుంది. కేసును సుమోటోగా తీసుకుంది. హైకోర్టు ఆదేశాలతో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ రంగంలోకి దిగడంతో అసలు నిజాలు వెలుగు చూశాయి.
రోడ్డు విస్తరణ పనుల ప్రాజెక్టు ఏ స్థితిలో ఉందో విచారణ చేపట్టకుండానే కెనరా బ్యాంకు కన్సార్షియం రూ.1,029.39 కోట్లను మంజూరు చేసిందని ఎస్ ఎఫ్ ఐవో తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ నిధుల్లో సుమారు రూ.264 కోట్లను కంపెనీ దారి మళ్లించిందని గుర్తించింది. ఈ నిధులను ప్రాజెక్టుకు వినియోగించలేదని ఎస్ ఎఫ్ ఐవో తన నివేదికలో వివరించింది. దీంతో… మధుకాన్ పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు నమోదు చేసింది.