Begin typing your search above and press return to search.
శశికళ భర్త కూడా ఊచలు లెక్కించాల్సిందేనా?
By: Tupaki Desk | 20 Feb 2017 12:30 PM GMTఅక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు ఆయన భర్త నటరాజన్ కూడా తోడయ్యేలా ఉన్నారు. పాత కేసులు ఆయనను వెంటాడుతుండడంతో కొద్దిరోజుల్లో ఆయన ఊచలు లెక్కబెట్టక తప్పదంటున్నారు.
గతంలో సీబీఐ ఆయనపై నమోదు చేసిన కేసులు ఇప్పుడు వేగం పుంజుకున్నాయి. 1994లో లెక్సస్ కార్ల దిగుమతికి సంబంధించి సీబీఐ, ఈడీలు నటరాజన్ సహా మరో ముగ్గురిపై వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి. అయితే, గత ఐదేళ్లుగా అప్పీళ్లతో నటరాజన్ ముందుకెళుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో, కేసు విచారణను వెంటనే పూర్తి చేయాలని ఇటీవలే మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ సీబీఐకి మెమోలు పంపించారు. ఈ క్రమంలో ఈ కేసు చివరి విచారణ ఈ నెల 27న జస్టిస్ భాస్కరణ్ ధర్మాసనం ముందు జరగనుంది.
శశికళతో బాటు, ఆమె జైలుకెళ్లే ముందు నియమించిన అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీడీ దినకరన్ పై పెండింగులో ఉన్న కేసులను కూడా త్వరగా విచారించాలని ఆర్థిక నేరాల కోర్టుకు ఈడీ లేఖ రాసింది. ఈ కేసుల తీవ్రతను చూస్తే వీరు కూడా కటకటాలు లెక్కించక తప్పదంటున్నారు వీరి ప్రత్యర్థులు. జైల్లో ఉన్న శశికళకు ఇప్పటికే ఈ సమాచారం అందినట్లు తెలిసిందట.. దీంతో జైల్లో భర్తను కలుసుకోవచ్చని ఆనందించాలో లేదంటే.. ఆయనా జైలుకొస్తున్నారని బాధపడాలో తెలియని స్థితిలో ఉన్నారట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/