Begin typing your search above and press return to search.
సీబీఐ మాజీ చీఫ్ కొడుకుపై సీబీఐ కేసు
By: Tupaki Desk | 21 Feb 2016 9:05 AM GMTసీబీఐకి చీఫ్ గా వ్యవహరించిన తెలుగు అధికారి విజయరామారావు. సీబీఐ చీఫ్ పదవి నుంచి రిటైర్ అయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మంత్రి పదవిని చేపట్టిన ఆయన.. ఒకదశలో రాజకీయాల్లో కీలకభూమిక పోషించారు. అలాంటి ఆయన ఫ్యామిలీ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆయన పుత్రరత్నం చేసిన పనులకు ఆయన పరపతి తీవ్రంగా దెబ్బ తినే అవకాశం ఉందని చెబుతున్నారు.
విజయరామారావు కుమారుడు శ్రీనివాస కల్యాణరావు.. పలు బ్యాంకుల నుంచి వందలాది కోట్ల రూపాయిలు అప్పులుగా తీసుకున్నారు. ఇందుకోసం నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి.. వాటిని బ్యాంకులకు తనఖా పెట్టి పెద్ద మొత్తంలో రుణాలు పొందిన అతగాడు.. ఇప్పుడు వాటిని తిరిగి చెల్లించే విషయంలో జరుగుతున్న లొల్లి చివరకు సీబీఐ అధికారులే కేసులు పెట్టే వరకూ వెళ్లింది.
మొత్తం మూడు బ్యాంకుల నుంచి రూ.304కోట్ల మేర రుణాలు తీసుకున్న శ్రీనివాస కల్యాణరావుపై తాజాగా సీబీఐ కేసులు నమోదు చేసింది. బ్యాంకుల దగ్గర నుంచి తీసుకున్న రుణాలకు సమర్పించిన డాక్యుమెంట్లు నకిలీవిగా తేలాయి. దీంతో.. హైదరాబాద్.. చెన్నైలో ఉన్న కల్యాణరావు ఇళ్లపై అధికారులు సోదాలు నిర్వహించారు. తాజాగా ఈ కేసుకు సంబంధించిన ఆయన్ను అదుపులోకి తీసుకొని విచారించే వీలుందని తెలుస్తోంది. ఒకప్పుడు సీబీఐ మాజీ చీఫ్ గా వ్యవహరించిన వ్యక్తి కుమారుడిపై ఈ స్థాయిలో ఆరోపణలు రావటం.. కేసు నమోదు చేయటం ఇప్పుడు సంచలనంగా మారే అవకాశం ఉంది.