Begin typing your search above and press return to search.

ఓటుకు నోటులో బాబుపై చార్జిషీట్ ఇదే..

By:  Tupaki Desk   |   9 March 2017 7:22 AM GMT
ఓటుకు నోటులో బాబుపై చార్జిషీట్ ఇదే..
X
సూటిగా విషయంలోకే వెళ్లిపోదాం. ఎందుకంటే.. కొన్ని అంశాల విషయంలో ఏదైనా విశ్లేషణ చేస్తే.. దానికి లేనిపోని రంగులు అద్దే అలవాటు కొందరిలో ఎక్కువైంది. అలాంటప్పుడు విషయాన్ని విషయంగా చెప్పటానికి మించిన మంచి పద్ధతి మరొకటి ఉండదు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిరాకు పుట్టించే ఓటుకు నోటు ఇష్యూకు సంబంధించి అనుబంధ ఛార్జిషీట్ ను దాఖలు చేశారు. ఇందులోని అంశాల్ని ఉన్నట్లుగా చెప్పేస్తే..

= ఏసీబీకి సమర్పించిన అనుబంధ చార్జిషీట్ లో మొత్తం136 పేజీల సమాచారాన్ని అధికారులు ఏసీబీ కోర్టుకు సమర్పించారు. ఇందులో టీటీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి.. సండ్ర వెంకట వీరయ్య సంభాషణలు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో సెబాస్టియన్ ఫోన్ ద్వారా బాబు మాట్లాడిన సంభాషణ తదితర విషయాన్ని ఇందులో పేర్కొనటం గమనార్హం.

= 2015 మే 28న మహానాడు కేంద్రంగా పలువురు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు బాబు వర్గం వ్యూహం రచించారు. ఇందులో భాగంగా పార్టీలోని ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగించారు. మహానాడుకు హాజరవుతూనే రేవంత్.. సండ్ర వెంకట వీరయ్యలు ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నాలు కొనసాగించారు. ఈ విషయాల్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.

= సెబాస్టియన్ – సండ్ర వెంకట వీరయ్యలు ఫోన్ సంభాషణల్లో.. మహానాడుకు వెళ్లే ముందు చంద్రబాబు నివాసంలో మీటింగ్ ఉంటుంది. అందులో ఎమ్మెల్యేల కొనుగోళ్లపై చర్చిస్తారు. మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యను ట్రాప్ చేసినట్లు ఎమ్మెల్యే సండ్ర.. సెబాస్టియన్ కు చెప్పారు. రాజయ్యను ట్రాప్ చేసేందుకు వరంగల్ లోని తమ క్రిస్టియన్ సెల్ పని చేసినట్లు సండ్ర సంభాషణలు చెబుతున్నాయి.

= ఓటుకు నోటు కేసులో ఏ2గా ఉన్న సెబాస్టియన్ .. సండ్రకు మెసేజ్ చేస్తూ.. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే లాబీయింగ్ యాభై శాతం పని పూర్తి అయ్యిందని పేర్కొన్నారు. సెబాస్టియన్ ఫోన్ లో ప్రతి ఫోన్ కాల్ రికార్డు అయ్యాయి. ఆ ఫోన్ కాల్స్ ఏసీబీకీ కీలకమయ్యాయి. ఇలా లభించిన కాల్ రికార్డులలో చంద్రబాబు మాట్లాడిన మాటలు రికార్డు అయ్యాయి. స్టీఫెన్ సన్ తో బాబు మాట్లాడిన మాటలూ రికార్డు అయ్యాయి. రికార్డు అయిన వాటిల్లో ఎక్కడా ఎడిటింగ్ జరగలేదు.

= మే 30న బాబు తనతో మాట్లాడిన రోజు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో తన ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించినట్లు సెబాస్టియన్ కు స్టీఫెన్ సన్ ఫోన్ లో తెలిపారు. నిఘా వర్గం నుంచి వచ్చామంటూ ఇంటిని తనిఖీ చేసినట్లు తన భార్య తనకు చెప్పినట్లుగా స్టీఫెన్ సన్ సెబాస్టియన్ కు ఫోన్ లో తెలిపారు.

=ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు కొనుగోలు చేయాల్సిన ఎమ్మెల్యేలతో క్యాంపు నడిపించేందుకు బాబు వర్గం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు (ఏసీబీ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు) రేవంత్ రెడ్డి – సెబాస్టియన్ మధ్య సాగిన సంభాషణల్లో క్యాంపు ఏర్పాట్లు.. నోవాటెల్ కేంద్రంగా వ్యవహారాలు సాగాయి.

= స్టీఫెన్ సన్ ను తీసుకొని నోవాటెల్ హోటల్ కు రావాలని ఎమ్మెల్యేలు సండ్ర.. రేవంత్ లు సెబాస్టియన్ కు సూచించారు. స్టీఫెన్ సన్ హోటల్ కు రావటానికి ఇబ్బంది పడుతున్నారని.. ఇంట్లోనే కలుద్దామని సెబాస్టియన్ వారికి(రేవంత్.. సండ్రకు) చెప్పారు. కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల క్యాంపు కోసం నాటి టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు నోవాటెల్లో 9 గదులు బుక్ చేశారు. ఆ విషయాన్ని నోవాటెల్ హోటల్ ఫైనాన్స్ డైరెక్టర్ ఏసీబీకి వెల్లడించారు.

= అనుబంధ ఛార్జిషీట్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును 22సార్లు ప్రస్తావించటం గమనార్హం. చంద్రబాబు తనకు హామీ ఇచ్చారని.. ఆ మేరకు తాను నడుచుకుంటానని స్టీఫెన్ సన్..సెబాస్టియన్ తో మాట్లాడిన సంభాషణల్లో స్పష్టంగా బయటపడింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/