Begin typing your search above and press return to search.

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చిన జగన్ సర్కార్ !

By:  Tupaki Desk   |   25 Dec 2019 5:06 AM GMT
టీడీపీ మాజీ ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చిన జగన్ సర్కార్ !
X
అవినీతి చేసిన వారిపై ఉక్కుపాదం మోపుతాం అని చెప్తూ వస్తున్న ఏపీలోని జగన్ సర్కార్ ..ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం ద్వారా అవినీతికి పాల్పడిన వారిపై కొరడా విసురుతున్న ఏపీ ప్రభుత్వం తాజాగా టీడీపీ కి చెందిన మాజీ ఎమ్మెల్యే పై సంచలన నిర్ణయం తీసుకుంది. గుంటూరు జిల్లాకు గురజాలకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు మెడకు మరో ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై ఉన్న కేసులను సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

గుంటూరు జిల్లాలోని నడికుడి - కేసనుపల్లి - కోణంకి గ్రామాల్లో అక్రమ మైనింగ్ వ్యవహారంపై విచారణ జరపాలని తెలిపింది. 1994 - 2009 - 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం నుండి అయన మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. కాగా., 2014 ఎన్నికల్లో టీడీపీ ఆధికారం చేపట్టడంతో ఆయన పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్‌ కు పాల్పడ్డారంటూ అయన పై ఆరోపణలు కూడా వచ్చాయి. 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలైయ్యారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సీబీఐకు అప్పగిచ్చిన తొలి కేసు ఇదే కవడం విశేషం.

అయితే , ఈ మాజీ ఎమ్మెల్యే కేసుని మూడు నెలల క్రిందటే సిబిఐ కి అప్పగించాలని చూసినప్పటికీ - యరపతినేని కొద్ది రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఆ‍యన అజ్ఞాతం వీడి బయటకు వచ్చారు. దీనితో ఏపీ మంత్రివర్గం నిర్ణయం మూడు నెలల తర్వాత ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. మరోవైపు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆధిక ఆదాయ వ్యవహారలపై ఈడీతో పాటు సీబీఐ దర్యాప్తు చేయించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రపతి కార్యాలయం సంబంధిత మంత్రిత్వశాఖకు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై కేంద్ర మంత్రిత్వశాఖ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనుంది.