Begin typing your search above and press return to search.

జగన్ పై సీబీఐ దాఖలు చేసిన 14 పేజీల కౌంటర్లో ఏముంది?

By:  Tupaki Desk   |   2 Oct 2019 5:49 AM GMT
జగన్ పై సీబీఐ దాఖలు చేసిన 14 పేజీల కౌంటర్లో ఏముంది?
X
తనపై పెట్టిన అక్రమాస్తుల కేసుల విచారణకు తూచా తప్పకుండా హాజరైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఏపీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత మాత్రం విచారణ హాజరుకు మినహాయింపు కోరటం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న తనకు పనుల ఒత్తిడితో పాటు.. పదవిలో ఉన్న కారణంగా కోర్టుకు రావాల్సిన అవసరం లేకుండా అనుమతి ఇవ్వాలని కోర్టును కోరటం తెలిసిందే.

దీంతో.. కేసు విచారణకు హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వటం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా సీబీఐ కోర్టును కోరింది. నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై 14 పేజీల కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. సీబీఐ డీఐజీ వి.చంద్రశేఖర్ దాఖలుచేసిన ఈ అఫిడవిట్ పై తదుపరి విచారణను కోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా పేర్కొన్న అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా సీబీఐ చేసిన వ్యాఖ్యలు ఏమిటి? కౌంటర్ అఫిడవిట్ లో ఏ అంశాల్ని ప్రస్తావించారన్నది చూస్తే..

- చట్టం ముందు అందరూ సమానమే. పదవిలో ఉన్న కారణంగా వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరటం రాజ్యాంగంలోని 14వ అధికారణకు విరుద్ధం. నిందితుల హోదా.. ఆర్థిక నేపథ్యం ఆధారంగా వ్యక్తిగత హాజరు ఇవ్వకూడదు. అలా చేస్తే.. తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది.

- జ్యూడిషియల్ కస్టడీలో భాగంగా జైల్లో ఉన్నప్పుడే జగన్ తన పలుకుబడిని.. కండబలాన్ని ఉపయోగించారు. ఇప్పుడు సీఎంగా ఉన్నారు. అన్ని అధికారాలు ఆయనకు ఉన్నాయి. వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇస్తే.. సాక్షులు భయాందోళనలకు గురయ్యే అవకాశం ఉంది.

- ఎంపీగా ఉన్న సమయంలోనే సాక్ష్యులను తీవ్రంగా ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మినహాయింపు ఇస్తే అర్థ బలాన్ని.. అంగబలాన్ని వాడుకోవటానికి స్వేచ్ఛ ఇచ్చినట్లే.