Begin typing your search above and press return to search.
హత్రాస్ కేసు: గ్యాంగ్ రేప్ నిజమే..సీబీఐ చార్జిషీట్
By: Tupaki Desk | 18 Dec 2020 3:45 PM GMTదేశవ్యాప్తంగా అట్టుడికిన ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ అత్యాచార ఘటనలో సంచలన నిజాలు వెలుగుచూశాయి. తాజాగా ఈ కేసులో తాజాగా సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. 19 ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని సీబీఐ చార్జిషీట్ లో పేర్కొంది. నలుగురు నిందితులపై అత్యాచారం, హత్య అభియోగాలను మోపింది. ఈ మేరకు నలుగురిపై స్థానిక కోర్టులో సీబీఐ అభియోగాలు మోపుతూ చార్జీషీట్ దాఖలు చేసింది.
గత సెప్టెంబర్ 14న హత్రాస్ కు చెందిన ఓ దళిత బాలికపై అదే గ్రామంలోని ఉన్నత వర్గానికి చెందిన నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఢిల్లీలోని సఫ్జర్ జంగ్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ అదే నెల 29న మృతి చెందింది. 30వ తేది అర్ధరాత్రి ఆమె మృతదేహాన్ని పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా దహనం చేయడం దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైంది.
దళిత బాలికపై అత్యాచారం, హత్యపై విపక్షాలు, బాధితులు దళితులు భగ్గుమనడంతో ఉత్తరప్రదేశ్ అల్లకల్లోలంగా మారింది. దీంతో యూపీలోని యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐ అప్పగించింది.
సీబీఐ అధికారులు నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఫోరెన్సిక్ పరీక్షలు చేశారు. అత్యాచారం అనంతరం ట్రీట్ మెంట్ చేసిన.. పోస్టుమార్టం రిపోర్టులను విశ్లేషించారు. అనంతరం బాధితురాలి వాంగ్మూలం నమోదును తీసుకున్నారు. తాజాగా అత్యాచారం చేశారని చార్జీషీటులో దాఖలు చేశారు.