Begin typing your search above and press return to search.

3822కోట్ల బ్యాంకు లోన్ మళ్లించిన రాయపాటి

By:  Tupaki Desk   |   3 Jan 2020 8:54 AM GMT
3822కోట్ల బ్యాంకు లోన్ మళ్లించిన రాయపాటి
X
టీడీపీ మాజీ ఎంపీ, సీనియర్ నేత రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ వ్యవహారాల్లో తవ్వినకొద్దీ నమ్మశక్యం కానీ నిజాలు వెలుగుచూస్తున్నట్టు సమాచారం. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ వివిధ బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్న కోట్లాది రూపాయలను దారి మళ్లించడమే కాక.. పెద్ద ఎత్తున విరాళాలకు కూడా ఖర్చు పెట్టిందని సీబీఐ విచారణలో నిగ్గుతేల్చిందట.. కోట్లాది రూపాయలను సింగపూర -, ఇతరదేశాలకు మళ్లించినట్టు సీబీఐ గుర్తించినట్టు తెలిసింది..

2012లో వందల ఏళ్ల చరిత్రగల పురాతన తిరుచానూరు పద్మావతి అమ్మవారికి రాయపాటి కుటుంబంతో కలిసి పర్యటించి విరాళంగా వజ్రాల తాపడం చేసిన కోట్ల విలువైన చీరను సమర్పించారు.దీని ఖర్చును ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ భరించినట్టు సీబీఐ లెక్కతేల్చింది.

+ ట్రాన్స్ ట్రాయ్ నుంచి మళ్లించిన సొమ్ముల వివరాలు

* 2013 - 14లో ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ నుంచి రూ.15.34 కోట్ల రూపాయల్ని సింగపూర్ లోని పి.టి.ఇ లిమిటెడ్ కంపెనీకి అనుమతి లేకుండా మళ్లించినట్టుగా గుర్తించారు.

*2012-13 ఆర్థిక సంవత్సరంలో మరో రూ.5.28 కోట్ల రూపాయల్ని బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేసేందుకు వినియోగించినట్టుగా తెలుస్తోంది.

* బ్యాంకు సొమ్ము పప్పుబెల్లాల్లా ఖర్చు

బ్యాంకు అప్పుగా ఇచ్చిన సొమ్మును నిబంధనల ప్రకారం ఉద్దేశించిన వ్యాపారానికి మాత్రమే ఖర్చుపెట్టాలి. కానీ కంపెనీ డైరెక్టర్లు భారీ అవకతవకలకు పాల్పడినట్టుగా సిబిఐ విచారణలో వెలుగుచూసినట్లు సమాచారం. సదరు అవకతవకల్ని సరిదిద్దేందుకు అకౌంట్ పుస్తకాల్లో లెక్కల్నికూడా మార్చినట్టు కనిపిస్తోందని అధికారులు అంటున్నారు.

మొదట్లో రూ.2,341 కోట్ల రూపాయలను కుమార్ అండ్ కంపెనీకి తరలించినట్టుగా అనుకున్నారు. కానీ తర్వాత లెడ్జర్ వివరాలను బట్టి చూస్తే జయలక్ష్మీ పవర్ కార్పొరేషన్ పేరుతో ఉన్న ఓ కంపెనీని కొనేందుకు రూ36 కోట్ల రూపాయల్ని బ్యాంకుల అనుమతి లేకుండా ఖర్చుచేసినట్టు తెలుస్తోంది.

*భారీగా దారి మళ్లించిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ డైరెక్టర్

ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ డైరెక్టర్లు బ్యాంకుల నుంచి తీసుకున్న సొమ్మును భారీగా దారిమళ్లించినట్టు సీబీఐ గుర్తించింది. వివిధ మార్గాల్లో కంపెనీనుంచి కంపెనీ డైరెక్టర్లు రూ.3,822 కోట్ల రూపాయలను దారి మళ్లించారని తేల్చారు. ఇందులో రూ. 794 కోట్ల రూపాయల్ని రిజర్వ్స్ అండ్ సర్ ప్లస్ హెడ్స్ కింద అడ్జస్ట్ చేశారని విజిలెన్స్ ఆడిట్ లో తేలినట్టుగా అధికారులు చెబుతున్నారు. అలాగే స్టాక్ స్టేట్ మెంట్లని మానిప్యులేట్ చేశారనీ, రూ. 2,298 కోట్ల మేరకు లెక్కల్లో తేడా వచ్చిందనీ వివరాలు తెలియవచ్చాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిబిఐ ట్రాన్స్ ట్రాయ్ కంపెనీపై కుట్రపూరితమైన మోసం కేసు పెట్టింది. సిబిఐ బ్యాంకింగ్ సెక్యూరిటీస్ మరియు మోసాల సెల్ అధికారులు ఈ కేసుకు సంబంధించి కంపెనీ డైరెక్టర్లు రూ.264 కోట్లకు పైగా వడ్డీ మొత్తాన్ని కూడా దారి మళ్లించినట్టు విచారణలో తెలుసుకున్నారు.

మొదట చిన్నగానే కనిపించిన ఈ కేసును తవ్వినకొద్దీ భారీగా అక్రమాలు బయటపడుతుండడం విశేషం.