Begin typing your search above and press return to search.
జగన్ బెయిల్: సీబీఐ షాకింగ్ కౌంటర్
By: Tupaki Desk | 1 Jun 2021 1:30 PM GMTఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దుకు సంబంధించి ఈరోజు జగన్ తోపాటు సీబీఐ కూడా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. సీఎం జగన్ ఈ అఫిడవిట్ లో రఘురామ రాజకీయ కక్షపూరితంగానే ఈ పిటీషన్ వేశారు. వ్యక్తిగత ద్వేషంతో వేసిన ఈ పిటీషన్ కొట్టివేయాలని కోర్టులో విన్నవించారు. బెయిల్ షరతులను ఎక్కడా ఉల్లంఘించలేదని.. సీబీఐని ప్రభావితం చేయలేదని తెలిపారు. రఘురామ పిటీషన్ వాదనలో నిజం లేదని జగన్ లాయర్లు వాదించారు. కేంద్రహోంశాఖ పరిధిలో సీబీఐ పనిచేస్తుందని..రఘురామకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని వాదించారు. ఇలాంటి కేసుల్లో థర్డ్ పార్టీ జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను జగన్ న్యాయవాదులు గుర్తు చేశారు.
మరోవైపు ఈ కేసులో సీబీఐ కూడా ఈరోజు కౌంటర్ దాఖలు చేసింది. సీబీఐ అంటే కేంద్రంలోని సంస్థ కావడంతో జగన్ విషయంలో కేంద్రప్రభుత్వం తీరుకు ఈ అఫిడవిట్ అద్దం పడుతుందని అందరూ భావించారు.
అయితే సీబీఐ మాత్రం అటు జగన్ కు.. ఇటు రఘురామకు ఫేమర్ గా కాకుండా సీబీఐ కోర్టు ఈవిషయంలో నిర్ణయం తీసుకోవాలని ఎటువంటి అభిప్రాయం చెప్పకుండా 'నొప్పింపక.. తానొవ్వక' అన్న రీతిలో చాకచక్యంగా బయటపడిందన్న వాదన వినిపిస్తోంది.రఘురామ పిటీషన్ పై చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని సీబీఐ పేర్కొంది. కోర్టు విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని.. ఈ విషయంలో కోర్టుదే తుది నిర్ణయం అని తెలిపింది.
సీబీఐ ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ బెయిల్ అంశాన్ని సీబీఐ తన మీదకు రాకుండా కోర్టుకే నిర్ణయాధికారాన్ని వదిలేసి సర్ ప్రైజ్ చేసింది. ఇటు జగన్ కు సపోర్టు చేయకుండా.. అటు రఘురామ వంత పాడకుండా సీబీఐ వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది. దీంతో సీబీఐ కోర్టు ఈనెల 14కు విచారణను వాయిదా వేసింది.