Begin typing your search above and press return to search.
జగన్ హాజరుపై కోర్టు కీలక ఆదేశం
By: Tupaki Desk | 3 Jan 2020 11:50 AM GMTఏపీ సీఎం జగన్ ఆస్తుల కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన కోర్టుకు తప్పకుండా హాజరుకావాలని హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది.
ఈ కేసులో ప్రస్తుతం ఏ1గా సీఎం జగన్ ఉన్నారు. ఏ2గా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారు. వీరు ఈ శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరు కాలేదు. వారి తరుఫున న్యాయవాదులు హాజరై మినహాయింపు ఇవ్వాలని.. సీఎంగా బిజీగా ఉన్నారని కోర్టుకు విన్నవించారు. ఈ మేరకు కోర్టులో జగన్ తరుఫున పిటీషన్ దాఖలు చేశారు.
దీనిపై వాదనలు విన్న సీబీఐ కోర్టు జగన్, విజయసాయిరెడ్డిలు విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. ఈనెల 10న విచారణకు హాజరు కావాలని కోరింది. కేసులకు, హోదాకు సంబంధం లేదని న్యాయస్థానం పేర్కొంది.